
ప్రేమ వివాహం చేసుకోని వేరే గ్రామంలో నివాసం ఉంటున్న ప్రేమ జంటపై అమ్మాయి కుటుంబ సభ్యుల దాడికి దిగారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మల్లాపూర్ మండలం సాతారం గ్రామానికి చెందిన అనిల్, రమ్య గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇటీవల గుడిలో పెళ్లి చేసుకుని వేరే గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న రమ్య కుటుంబ సభ్యులు 2024 ఏప్రిల్ 05వ తేదీన అనిల్ ఇంటికి వచ్చి అతనిపై, కుటుంబ సభ్యులపై దాడి చేసి రమ్యను తీసుకెళ్లారు. అనిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.