
మనకు ఉగాది పండగ ఎలాగో..కేరళ ప్రజలకు ఓనం పండగ అలా. ఆ రాష్ట్రంలో ఓనం పండగను ప్రజలంతా ఉత్సాహంగా, సంతోషంగా జరుపుకుంటారు. ఈ ఓనం పండగ అంటే ముందుగా గుర్తొచ్చేది కసావు చీర. ఈ పండగ రోజున అక్కడి మహిళలు కసావు చీరను ధరిస్తారు. అయితే ఓనం పండగ సందర్భంగా ఓ బాలిక కసావు చీరను ధరించి స్కేటింగ్ చేసి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ బాలిక స్కేటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ALSO READ : గుండెలు పిండేసిన ఘటన : చనిపోయిన అన్నయ్య చేతికి రాఖీ కట్టిన చెల్లెలు
ఐదేళ్ల ఐరా ఐమెన్ ఖాన్ ఓనం పండగ సందర్భంగా కసావు చీర ధరించింది. అంతేకాదు..కొచ్చిలో తన ఇంటి దగ్గర ఉన్న స్కేట్ పార్కులో స్కేటింగ్ చేస్తూ ఆకట్టుకుంది. చాలా సులువుగా కసావు చీరలో స్కేటింగ్ చేస్తూ..ఔరా అనిపించింది. స్కేటింగ్ పార్కులో అద్భుతమైన విన్యాసాలతో ఆశ్చర్యపరిచింది. ఐరా ఐమెన్ ఖాన్ స్కేటింగ్ చేస్తుండగా..ఫోటో గ్రాఫర్ నవాఫ్ షరావుద్దీన్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే మిలియన్ల మంది వీక్షించారు. ఇప్పటి వరకు 3 మిలియన్ల మంది వీడియోను తిలకించడం విశేషం. అంతేకాకుండా 5 లక్షలకు పైగా లైక్స్ అందుకుంది.