హైదరాబాద్ : ముషీరాబాద్ లోని కవాడిగూడలో 13 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగానికి వెళుతుండటంతో.. బాలిక మాత్రమే ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు బాలిక తండ్రి ఇంటికి ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేయలేదు. దీంతో కంగారు పడిన తండ్రి.. ఇంటికి వెళ్లాడు. బాలిక ఇంట్లో కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. వెంటనే ఇంటిపక్కన ఉండేవాళ్లను వాకబు చేశాడు. చుట్టుపక్కల కూడా గాలించారు. ఇంటి దగ్గర వాళ్లని అడిగితే పాప ఎక్కడికో వెళ్లినట్లు చెప్పారని పేరెంట్స్ అంటున్నారు.
అన్ని చోట్ల వెతికినా బాలిక కనిపించకపోవడంతో చివరకు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య బాలిక ఫోన్ సిగ్నల్స్ నాగోల్ సమీపంలోని స్నేహపురి కాలనీలో చూపించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో స్నేహపురికాలనీలో పోలీసులు, బాలిక తల్లిదండ్రులు గాలించారు. అయినా అక్కడా బాలిక ఆచూకీ తెలియలేదు. మరోవైపు బాలిక మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.