
ప్రైవేటు పాఠశాల బస్సు ఢీ కొని ఓ బాలిక మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిభట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని నాదర్గుల్లో భావన(5) తల్లిదండ్రులతో నివసిస్తోంది. రాజీవ్ గృహకల్ప కాలనీలో ని ఓ ప్రైవేటు స్కూల్ బస్సు డ్రైవర్ భావనను గమనించకుండా ఆమె పై నుంచి బస్సును తీసుకెళ్లాడు.
దీంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.