3 గంటల్లో ల్యాప్ట్యాప్ తయారీ...నిజంగా అద్భుతం కదా..

3 గంటల్లో ల్యాప్ట్యాప్ తయారీ...నిజంగా అద్భుతం కదా..

ఓ ల్యాప్ట్యాప్ను తయారు చేయాలంటే ఎంత సమయం పడుతుంది. ఓ రోజు..లేదా రెండు రోజులు..లేదా వారమా..?  దానికి సంబంధించిన పరికరాల తయారీకి చాలా సమయం పడుతుంది.  అలాంటిది. ల్యాప్ట్యాప్ తయారీకి ఎక్కువ కాలమే కావాలి. అయితే ఒకరు మాత్రం  కేవలం మూడు గంటల్లోనే ల్యాప్ట్యాప్ తయారు చేసింది. ఈ ల్యాప్ట్యాప్ చేసింది టెక్ కంపెనీ కాదు..సాఫ్ట్ వేర్ ఎంప్లాయి కాదు..కేవలం ఓ చిన్నారి. ఇది నిజం.  వివరాల్లోకి వెళ్తే..

3 గంటల్లో ల్యాప్ టాప్ తయారీ..

నేహా అనే ఓ మహిళ ల్యాప్టాప్లో తన పనిచేసుకుంటుంది. ఇంతలో తన మేనకోడలు  నేహను ల్యాప్ట్యాప్ కావాలని అడిగింది. కానీ ఆమె ఇవ్వలేదు. దీంతో మనస్థాపానికి గురైన నేహ కోడలు..సొంతంగా ల్యాప్టాప్ను తయారు చేసుకుంది. 3 గంటల పాటు నిర్విరామంగా శ్రమించి అద్బుతమైన ల్యాప్టాప్ను తయారు చేసింది. ప్రస్తుతం ఈ ల్యాప్టాప్ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

అసలు ట్విస్ట్ ఏంటంటే..

 తన మేనకోడలు 3 గంటల్లో ల్యాప్టాప్ తయారు చేసుకుందన్న విషయాన్ని నేహ ట్విట్టర్లో వెల్లడించింది. అంతేకాదు ఆ చిన్నారి తయారు చేసిన ల్యాప్టాప్ ఫోటోలను షేర్ చేసింది. ఎంతో కష్టపడి ల్యాప్టాప్ తయారు చేసుకుందని..ఇది అచ్చం నిజమైన ల్యాప్టాప్ లాగే ఉందని పేర్కొంది. కానీ నిజమైన ల్యాప్టాప్ లెక్క పనిచేయదని వెల్లడించింది. 

వావ్ ఇది నిజంగా అద్భుతం..

3గంటల్లో ల్యాప్ టాప్ తయారు చేయడంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. ట్విట్టర్ లో నేహా షేర్ చేసిన ఫోటోలను 3 లక్షల మందికిపైగా వీక్షించారు. వేల సంఖ్యలో లైక్స్ కొట్టారు. సొంత తెలివితో ఆ చిన్నారి ల్యాప్ టాప్ ను తయారు చేసుకోవడం నిజంగా అద్భుతమంటూ మెచ్చుకున్నారు. ఆమెను కళాకారిణిగా అభివర్ణించారు.