సూర్యాపేట జిల్లాలో బాలిక కిడ్నాప్.. బంగారం కోసం ఎత్తుకెళ్లిన దుండగులు

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 16 వార్డు తిరుమలానగర్ లో ఇంటిముదు ఆడుకుంటున్న 5 ఏళ్ల రిత్విక అదృశ్యమయింది. బాలిక ఒంటిమీద ఉన్న బంగారు గొలుసు, చెవి దుద్దుల కోసం చిన్నారిని ఎత్తుకెళ్లారని పాప తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.  ఈ మేరకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాలిక ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు.