ఇల్లెందులో డెంగ్యూతో బాలిక మృతి

ఇల్లెందులో డెంగ్యూతో బాలిక మృతి

ఇల్లెందు, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందులో డెంగ్యూతో ఓ బాలిక ఆదివారం మృతిచెందింది. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. పట్టణంలోని స్టేషన్ బస్తీకి చెందిన బండ్ల వెంకటేశ్వర్లు, -కోటమ్మ కూతురు బండ్ల మేధాశ్రీ (11)  కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నది. ఇల్లెందు, ఖమ్మం ప్రభుత్వ దవాఖానల్లో చూపించినా తగ్గలేదు. 

దీంతో డెంగ్యూ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్​వచ్చింది. వెంటనే బాలికను ఖమ్మం నుంచి వరంగల్ ఎంజీఎంకు, ఆ తర్వాత హైదరాబాద్​కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మేధాశ్రీ చనిపోయింది.