ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన ప్రియురాలు

మంచిర్యాల జిల్లా : ప్రేమించానని వెంటపడి.. తీరా ఓకే అన్నాక..  పెళ్లికి మొహం చాటేసిన ప్రియుడి ఇంటి ముందు ఓ ప్రేమ బాధితురాలు న్యాయ పోరాటం చేపట్టింది. ప్రేమ పేరుతో వెంటపడి.. సరే నన్నాక.. నాలుగేళ్లకుపైగా కాలం కలసి మెలసి తిరిగి ఆ తర్వాత మొహం చాటేశాడని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రియుడితో పెళ్లి జరిపించే వరకు కదిలేది లేదంటూ ఏకంగా ప్రియుడి ఇంటి ముందే నిరసన పోరాటం ప్రారంభించింది. మందమర్రి మండలం పొన్నారం గ్రామంలో ప్రేమించిన ప్రియుడు బోర్లకుంట రమేష్ ఇంటి ముందు బైఠాయించింది అతని ప్రియురాలు గోమాస జాన్సీ. గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించిన ప్రియుడు పెళ్లి చేసుకోమంటే.. అదిగో ఇదిగో నుంటూ చివరకి నిరాకరించడం మొదలుపెట్టాడని గోమాస జాన్సీ కంటతడిపెట్టుకుని విలపిస్తోంది. కాబోయే భార్యా భర్తలుగా సమాజంలో చెలామణి అయ్యామని.. ఇప్పుడు తన పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని కంటతడిపెట్టుకుంది. బాధితురాలు చేపట్టిన న్యాయ పోరాటానికి ఎమ్మార్పీఎస్, సీపీఐ, మహిళ  సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. పెద్దలు స్పందించి జోక్యం చేసుకుని పెళ్లి జరిపించాలని సూచిస్తున్నారు.

see more news

గోల్డ్‌, ఎఫ్‌డీల కంటే షేర్లే బెటర్

ఖతర్నాక్ డ్రోన్.. గాల్లోకి లేచిందంటే మూడ్నేళ్లు ఆకాశంలోనే

కారులో వచ్చి ఏటీఎం చోరీ.. సీసీ కెమెరాలో రికార్డ్