రాజన్న సిరిసిల్ల జిల్లా: ఓ ప్రేమ వ్యవహారం చివరికి హత్యకు దారి తీసింది. యువతి బందువుల ఆవేశం యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొన్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్థి మండలంలోని లింగంపేటలో చోటు చేసుకుంది. లింగంపేటలోని శివ అనే యువకుడు ఎనగల్ గ్రామానికి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం నడిపించాడు.
ఈ నెల11 వ తేదీన బోయినపల్లి మండలంలోని కోరేం గ్రామంలో జరిగిన బీరప్ప ఉత్సవాలకు శివ హాజరయ్యాడు. ఈ ఇద్దరి ప్రేమ వ్యవహారం తెలిసిన యువతి తరుపు బందువులు బీరప్ప ఉత్సవాల్లో కాపుకాసి శివపై దాడి చేశారు. ఆ దాడిలో తీవ్ర గాయాలపాలైన శివను.. ఆయన బంధువులు హాస్పిటల్ కు తరలించారు.
ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న శివ మృతి ఏప్రిల్ 16న మృతి చెందాడు. శివ-- మృతికి కారణం అయిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఎనగల్ గ్రామంలో శివ తరుపు బందువులు ధర్నా చేపట్టారు. దాంతో అప్రమత్తం అయిన పోలీసులు శివ బంధువుల్ని అక్కడి నుంచి పంపిచే ప్రయత్నం చేశారు. నిందితులపై చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.