ప్రేమించి పెళ్లి చేసుకున్నడని ఇల్లు కాలబెట్టిన్రు

హుజురాబాద్ మండలంలోని ఇందిరానగర్లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కారణంతో అబ్బాయి ఇల్లును అమ్మాయి తరపు బంధువులు తగులబెట్టారు. హుజురాబాద్ కు చెందిన రాజశేఖర్ అదే గ్రామానికి చెందిన సంజనను ప్రేమించాడు ఇటీవలే వేములవాడలో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం రక్షణ కల్పించాలని కోరుతూ హుజురాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. విషయం తెలుసుకున్న అమ్మాయి కుటంబసభ్యులు, బంధువులు ఆగ్రహంతో రగిలిపోయారు. అబ్బాయి ఇంటిపై దాడి చేసి ఇల్లు తగలబెట్టారు.  

ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణపాయం తప్పింది. కానీ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు దగ్ధమయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫైనాన్స్ లో తెచ్చిన రూ. 50 వేల కాలిపోయాయని రాజశేఖర్ తండ్రి దేవయ్య వాపోయాడు. అమ్మాయి తరుపున వాళ్లు తమని చంపుతామని  బెదిరిస్తున్నారని, రక్షణ కల్పించాలని కోరుతున్నారు.