హైదరాబాద్: జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో ఇవాళ ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మేఘనారెడ్డి అనే విద్యార్థిని క్యాంపస్ లోని CSR బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. కూకట్ పల్లిలోని రామారావు నగర్ లో నివసించే మేఘనా.. జేఎన్టీయూలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదువుతోంది. అయితే ఇవాళ మేఘనా రెడ్డిని ఆమె తల్లి క్యాంపస్ లో దింపి వెళ్లిన గంటకే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో కాలేజీ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
ఈ విషయం తెలుసుకున్న కూకట్ పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనారోగ్య సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మేఘనా క్లెవర్ స్టూడెంట్ అని లెక్చరర్లు చెబుతున్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడేదని.. కానీ సూసైడ్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో తెలియదంటున్నారు. అయితే పోలీసులు మాత్రం హెల్త్ ఇష్యూతోనే ఆమె సూసైడ్ చేసుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు.