కీసర గురుకులంలో స్టూడెంట్లను కరిచిన ఎలుకలు

కీసర గురుకులంలో స్టూడెంట్లను కరిచిన ఎలుకలు

కీసర, వెలుగు: కీసర కేజీబీవీ హాస్టల్​లో ఎలుకల బెడద ఎక్కువైంది. ఆదివారం నిద్రపోతున్న పలువురు స్టూడెంట్లను కరిచాయి. ఈ విషయం బయటికి రాకుండా ప్రిన్సిపాల్ మహాలక్ష్మి, హాస్టల్​వార్డెన్ మ్యానేజ్​చేస్తున్నారు. కీసర ప్రభుత్వ దవఖానాలో బాధిత స్టూడెంట్లకు వైద్యం అందించి జాగ్రత్త పడ్డారు. కొన్నిరోజులుగా ఇదే సమస్య ఉన్నా కనీస చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది.

ఎలుకలు కరిచిన విషయాన్ని ప్రిన్సిపాల్​కనీసం స్టూడెంట్ల తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. సోమవారం ఉదయం మీడియా ప్రతినిధులు స్కూల్​వద్దకు వెళ్లగా లోపలికి అనుమతించలేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్​మెంట్ తీసుకుంటున్న విద్యార్థుల ఫొటోలు బయటకు వచ్చాయి.