
పద్మారావునగర్, వెలుగు: ప్రమాదవశాత్తు నాలుగో అంతస్తు బాల్కనీలో చిక్కుకున్న బాలికను ఫైర్ సిబ్బంది కాపాడారు. ముషీరాబాద్ మెయిన్ రోడ్ లోని విజేత సంజీవని అపార్ట్ మెంట్ నాలుగో అంతస్తు బాల్కనీలో శుక్రవారం సాయంత్రం ఓ రెండేళ్ల బాలిక చిక్కుకుంది. మూసుకున్న తలుపు తెరవలేకపోవడంతో బాలిక ఏడవడం మొదలుపెట్టింది.
దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన గురై, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ముషీరాబాద్ ఫైర్ ఆఫీసర్ బి. నరసింహ పర్యవేక్షణలో సిబ్బంది సత్యనారాయణ, కృష్ణ, చంద్ర ప్రకాష్, హేమంత్ కుమార్ భవనం పైకి, పాపను సురక్షితంగా కాపాడారు.