పెండ్లి చేసుకోవాలని ప్రియుడి ఇంటిముందు ప్రియురాలి ధర్నా

పెండ్లి చేసుకోవాలని ప్రియుడి ఇంటిముందు ప్రియురాలి ధర్నా
  • న్యాయం చేయాలని బాధిత యువతి నిరసన
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఘటన

జూలూరుపాడు, వెలుగు:  పెండ్లి చేసుకుని తనకు న్యాయం చేయాలని ప్రియుడి ఇంటి ముందు యువతి ధర్నాకు దిగిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. జూలూరుపాడు న్యూకాలనీ కి చెందిన వినోద్ కు పాల్వంచ మండలం పుల్లయ్యగూడెంకు చెందిన ఆమనితో ఏడాది కిందట పరిచయమై ప్రేమకు దారితీసింది. ఆమెను పెండ్లి చేసుకుంటానని ప్రియుడు నమ్మించి శారీరకంగా లోబర్చుకుని అనంతరం పట్టించుకోవడంలేదు. ఆమెను పట్టించుకోకుండా మరో పెండ్లి చేసుకునేందుకు అతడు యత్నిస్తుండగా బాధిత యువతి బుధవారం ప్రియుడి ఇంటి ముందు నిరసన తెలిపింది. తనకు న్యాయం చేయాలని మహిళా సంఘ సభ్యులతో కలిసి బైఠాయించింది. పోలీసులు వెళ్లి  ఫిర్యాదు చేయాలని సూచించడంతో యువతి స్థానిక పోలీస్​స్టేషన్​లో కంప్లయింట్ చేసింది.