ప్రియుడి వేధింపులు తాళలేక ప్రియురాలు ఆత్మహత్య

 ప్రియుడి వేధింపులు తాళలేక ప్రియురాలు ఆత్మహత్య

రెండో పెండ్లి చేసుకున్న వ్యక్తి వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా మరిపెడ మండలం డీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెండాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తండా పరిధిలో జరిగింది. ఆముదాలగడ్డ తండాకు చెందిన బాదావత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోట్య, భారతి రెండో కూతురు అనూష (22) డిగ్రీ సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చదువుతోంది. జెండాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తండాకు చెందిన భూక్యా సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనే వ్యక్తికి అప్పటికే పెండ్లి కాగా, అనూషకు మాయమాటలు చెప్పి ఇంట్లో నుంచి తీసుకెళ్లాడు. 

తర్వాత అనూష పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసు పెట్టడంతో రెండో పెండ్లి చేసుకున్నాడు. దీంతో సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదటి భార్య సైతం అతడిపై కేసు పెట్టడంతో పాటు, ఆస్తిని తన పిల్లలకే రాసి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చింది. ఈ క్రమంలో మొదటి భార్యకు దూరంగా అనూషతో కలిసి ఉంటున్నాడు. ఇదిలా ఉండగా అనూషపై అనుమానం పెంచుకున్న సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆమెను తీవ్రంగా కొడుతుండడంతో వారం రోజుల కింద పుట్టింటికి వచ్చేసింది. అక్కడికి వచ్చిన సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనూషతో పాటు, ఆమె కుటుంబ సభ్యులపైనా దాడి చేశాడు. 

దీంతో అనూష తల్లిదండ్రులు మరిపెడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరచూ అనూష ఇంటికి వచ్చి చంపుతానని బెదిరిస్తుండడంతో మనస్తాపానికి గురైన ఆమె బుధవారం ఇంట్లో ఎవరూ లేని టైంలో ఉరి వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన అనూష తల్లి భారతి చుట్టుపక్కల వారి సాయంతో అనూషను కిందకు దింపి చూడగా అప్పటికే చనిపోయింది. యువతి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.