పాతికేళ్లకిందట ఇంటర్లో ఎకనమిక్స్ (అర్థశాస్త్రం) సబ్జెక్ట్ చదివేవాళ్లలో సగం మంది అమ్మాయిలే ఉండేవాళ్లు. ఇప్పుడు ఆ సంఖ్య మూడో వంతుకి పడిపోయింది. డిగ్రీలో అయితే కేవలం 20–30 శాతం మందే ఈ సబ్జెక్ట్‌ను సెలెక్ట్ చేసుకుంటున్నారు. పబ్లిక్ సెక్టార్ లో సీనియర్ మేనేజ్ మెంట్ స్థాయి లో ఉమెన్ ఎకనమిస్ట్‌ల పర్సంటేజీదీ ఇదే తీరు. టీచింగ్ ఫీల్డ్‌లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. సైన్స్ , టెక్నాలజీ, మ్యాథ్స్ లలో ఆడ ప్రొఫెసర్లు 20 శాతం వరకు ఉంటే ఎకనమిక్స్ లో 10 శాతం లోపే ఉన్నారు. ఈ ప్రభావం పలు రంగాలపై పడుతోంది. ప్రభుత్వ సంస్థల్లో గానీ ప్రైవేట్ రంగంలో గానీ నిర్ణయాలు తీసుకునే స్థాయిలో మగ ఎకనమిస్ట్లే ఎక్కువ మంది ఉండటం వల్ల కీలక చర్చల్లో ఆడవారికి సంబంధించిన అనేక ముఖ్యాంశాలు మిస్ అయ్యే అవకాశాలున్నాయి.దీని ఫలితంగా మహిళలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు తగ్గిపోతాయి. చివరకు ఆడవారి ప్రయోజనాలు దెబ్బతింటాయి.
సహజంగా ఆర్థిక శాస్త్రవేత్తలు ఫాలో అయ్యే మోడల్స్, మెథడ్స్ ఎక్కువగా జెం డర్ న్యూట్రల్ గానే ఉంటాయి. కానీ నిర్ణయాలు తీ సుకునే వేదికలపై మగవాళ్లు, ఆడవాళ్లు ఇద్దరూ ఉంటే మరిన్ని మంచి నిర్ణయాలు తీసుకునే వీలుంటుంది. ‘ఒక పనిని లేడీస్ , జెం ట్స్ ఒకేలా చేయలేరా?’ అంటే ‘చేయలేరు’ అని స్టడీలు చెబుతున్నా యి. మగ బ్యాంకర్లతో పోలిస్తే మహిళా బ్యాం కర్లు ఇండిపెండెంట్ గా పనిచేస్తారని ఈ అధ్యయనాలు పేర్కొన్నాయి. ఫలితంగా మంచి ఫలితాలు వస్తాయని వెల్లడైంది. అనేక సామాజిక సమస్యలపై ఆడ, మగ ఎకనమిస్టులు స్పష్టం గా విభేదిస్తు న్నట్లు యూఎస్ స్టడీ తెలిపింది. ఈ జాబితాలో హెల్త్, లేబర్ మార్కెట్లు, ట్యాక్సేషన్, ఎన్విరాన్ మెంట్, వెల్ఫేర్, సైనిక అవసరాల కోసం ప్రభుత్వం పెట్టే ఖర్చు తదితర అంశాలు ఉన్నాయి.
ఎకనమిక్స్ పై ఎందుకింత అనాసక్తి మొదటినుంచి ఎకనమిక్స్ ను మేల్ డామినేటెడ్ సబ్జెక్ట్ గా ముద్ర పడటమే మహిళలు ఈ సబ్జెక్ట్ పై ఆసక్తి చూపకపోవడానికి ప్రధాన కారణం. దీంతో ఎకనమిక్స్ లో మహిళల డ్రాపౌట్ ఎక్కువగా ఉంది. పురుషులతో సమానంగా మ్యాథమెటికల్ ఎబిలిటీస్ ఉన్నా స్త్రీలు సెల్ఫ్ రేటింగ్ చాలా తక్కువ ఇచ్చుకుంటున్నారు.
స్టడీలో ఆల్ రౌండ్ డెవలప్ మెంట్ కి సంబంధించి అమ్మాయిలకు రేటింగ్ ఇచ్చే విషయంలో టీచర్లు కూడా సరిగా బిహేవ్ చేయడం లేదు. వాళ్ల ఎడ్యుకేషన్ స్కిల్స్ కి లేదా ఇంటలెక్చువాలిటీకి ప్రాధాన్యత ఇవ్వకుండా పర్సనాలిటీ ట్రెయిట్స్ నే పట్టించుకుంటున్నారు. ఆడ పిల్లలపై మహిళా టీచర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. నిజ జీవితం పై ఎకనమిక్స్ ఎలా ఇంపాక్ట్ చూపుతుందో అర్థమయ్యేట్లు చెబితే తప్ప అమ్మాయిలు ఆ సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకోవడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఒక వేళ ఎకనమిక్స్ ను సెలెక్ట్ చేసుకున్నా పీజీతోనే చదువు ఆపేస్తున్నారు. దీంతో పీహెచ్ డీ చేసే ఆడపిల్లల సంఖ్య సింగిల్ డిజిట్ లోనే ఉంటోంది.
వివిధ కారణాల వల్ల అమ్మాయిలు పరిశోధనలపై పెద్దగా దృష్టి పెట్టట్లే దు. చదివినందుకు ఏదో ఒక జాబు చేయాలి కాబట్టి ప్రమోషన్లు పెద్దగా ఉండని టీచింగ్ , అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీల్లో చేరుతూ ఉన్నత ఉద్యోగావకాశాలను కోల్పోతున్నారు. ఇలా జరక్కుండా ఉండాలంటే వ్యవస్థను సరిచేయాలి. మహిళల నిజ మై న సమస్యలను గుర్తించి పరిష్కరిం చాలి. ఆడవారి ఆలోచనలూ మారాలి. ఫలానా రంగం మగవాళ్లకే సెట్ అవుతుంది గానీ తమకు కాదన్న మైండ్ సెట్ నుంచి బయటపడాలి.