అమ్మాయిల బాక్సింగ్‌లో అబ్బాయి అంటూ విమర్శలు ఎదుర్కొంటున్న అల్జీరియాకు చెందిన ఇమానే ఖెలిఫ్ ఒలింపిక్స్‌లో పతకం గెలిచింది. శనివారం జరిగిన విమెన్స్ 66 కేజీ క్వార్టర్ ఫైనల్లో ఖెలిఫ్ 5–0తో హంగేరీకి చెందిన అనా లుకాను చిత్తు చేసింది.
సెమీస్ చేరి కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది. అబ్బాయిగా పుట్టి అమ్మాయిగా మారిందంటూ వివాదంలో నిలిచిన ఖెలిఫాలో టెస్టోస్టిరాన్ హార్మోన్ల మోతాదు ఎక్కువ ఉండటంతో గతేడాది ఇంటర్నేషనల్ బాక్సింగ్ కమిటీ తనను నిషేధించింది.