రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ కు ఎంపికైన బాలికలు

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ కు ఎంపికైన బాలికలు

చిన్న చింతకుంట వెలుగు, వెలుగు: అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం వనపర్తి లో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో  మహబూబ్​నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అల్లీపూర్ కు చెందిన అలేఖ్య అండర్ 16 విభాగంలో జావెలిన్​  త్రో   బంగారు పతకం సాధించింది.  అదే గ్రామానికి చెందిన నందిని అండర్ 14విభాగంలో 60 మీటర్స్ లాంగ్ జంప్ ,హై జంప్ లో  బంగారు పతకం సాధించింది. వీరు ఈ నెల 18, 19 న ఉస్మానియా యూనివర్సిటీ గ్రౌండ్లో నిర్వహించే  రాష్ట్ర స్థాయి11వ  జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొన్ననున్నారు.