ఆర్మూర్, వెలుగు : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ఉర్దూ మీడియం ప్రైమరీ స్కూల్లో స్టూడెంట్స్ను లైంగికంగా వేధిస్తున్నాడనే ఆరోపణలతో.. పేరెంట్స్, యువకులు ఓ టీచర్ను చితకబాదారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. పెర్కిట్ ఉర్దూ మీడియం ప్రైమరీ స్కూల్ లో ఇబ్రహీం ఎనిమిదేండ్లుగా టీచర్ గా పని చేస్తున్నారు. కొద్ది రోజుల నుంచి ఐదో తరగతి చదువుతున్న బాలికలను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ స్టూడెంట్స్పేరెంట్స్, మైనార్టీ యువకులు శుక్రవారం స్కూల్ కు వచ్చారు.
టీచర్ ఇబ్రహీంను నిలదీసి కొట్టారు. వారు మాట్లాడుతూ 15 రోజుల క్రితం టీచర్ పై హెడ్మాస్టర్ఆసియా సుల్తానాకు కంప్లయింట్ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. పైగా తమనే బెదిరించారన్నారు. స్కూల్లో గొడవ జరుగుతుందని సమాచారం అందుకున్న ఎస్ఐ అశోక్ వచ్చి టీచర్ ఇబ్రహీంను అదుపులో తీసుకొని స్టేషన్ కు తరలించారు. ఎంఈవో రాజగంగారాం స్కూల్ కు వచ్చి వివరాలు సేకరించి జిల్లా అధికారులకు సమాచారమిచ్చారు.