- బాలికల జూనియర్ కాలేజీ కొత్త బిల్డింగ్ ప్రపోజల్ పెండింగ్
- క్లాస్రూంలు లేక ఇబ్బంది పడుతున్న బాలికలు
- రూ.2 కోట్లతో ప్రపోజల్ పంపినా స్పందించని అధికారులుసమస్యను పట్టించుకోని ఎమ్మెల్యే దాసరి
పెద్దపల్లి, వెలుగు: జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్‌కాలేజీ బిల్డింగ్ శిథిలమైంది. రెండేళ్ల నుంచి బాయ్స్కాలేజీ ల్యాబ్‌లో గర్ల్ స్టూడెంట్లకు తరగతులు నిర్వహిస్తున్నారు. అక్కడ కనీస వసతులు లేకపోవడంతో బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్ల క్రితం గర్ల్స్ కాలేజీని మూసేసి కొత్త బిల్డింగ్ కోసం ప్రభుత్వానికి రూ.2 కోట్లతో ప్రపోజల్స్పంపారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో క్లాసులు బాయ్స్ కాలేజీ ల్యాబ్‌లో నిర్వహిస్తున్నారు. కాలేజీ బిల్డింగ్‌కు ఫండ్ కేటాయిస్తారని, త్వరలో కొత్త భవనంలోకి మారుతామని ఎదురుచూస్తున్న విద్యార్థులకు ప్రతీ ఏడాది నిరాశే ఎదురవుతోంది.
రెండేళ్లయినా పట్టించుకుంట లేరు..
పెద్దపల్లి గర్ల్స్కాలేజీ బిల్డింగ్ పూర్తిగా శిథిలమవడంతో స్డూడెంట్లు తరగతి గదుల్లో కూర్చోవడానికి భయపడేవారు. దీంతో కాలేజీ ప్రిన్సిపాల్ ఇంటర్ బోర్డుకు సమాచారం ఇచ్చి స్థానిక ఎమ్మెల్యే దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. అయినా ప్రయోజనం లేకపోయింది. బాయ్స్ ల్యాబ్‌లో క్లాసులు నిర్వహిస్తుండడంతో సైన్స్ గ్రూప్ స్టూడెంట్లకు ప్రాక్టికల్స్ కోసం ల్యాబ్‌లు అందుబాటులో లేకుండా పోయాయి. మరోవైపు కాలేజీలో బాత్రూంలు లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు.
ఎమ్మెల్యేకు సమస్యల వివరించినా..?
బాలికల కాలేజీ బిల్డింగ్ సమస్యను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహరెడ్డికి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని స్టూడెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి సంఘాలతో కలిసి కాలేజీ విద్యార్థులు ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్‌కు సమస్యను వివరించారు. ఇటీవల పెద్దపల్లి ఇంటర్మీడియట్ జిల్లా అధికారి నేతృత్వంలో ఇంటర్ బోర్డుకు రూ.2 కోట్ల ప్రపోజల్పంపించగా అధికారులు శిథిలమైన కాలేజీని పరిశీలించి వెళ్లారు.
స్టూడెంట్స్ ఇబ్బందిని పట్టించుకుంట లేరు
బాలికల కాలేజీ కొత్త బిల్డింగ్ నిర్మాణానికి స్థానిక నాయకులెవరూ సహకరిస్తలేరు. ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి సమస్యను తీసుకపోయినం. విద్యార్థులతో కలిసి ఆందోళన చేసినం. ఎలాంటి సదుపాయాలు లేని తాత్కాలిక రూంలలో క్లాసులు నడుపుతున్నారు. వెంటనే బిల్డింగ్ మంజూరు చేయకపోతే ఆందోళన తీవ్రం చేస్తం.
- రవీందర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, పెద్దపల్లి
ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకపోయినం
బాలికల కాలేజీకి కొత్త బిల్డింగ్ కావాలని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించాం. స్థానిక అధికారులతో పాటు రాష్ట్రస్థాయి అధికారులకు నివేదికలు పంపాం. ఇటీవల ఇంటర్ బోర్డు అధికారులు కాలేజీ పాత బిల్డింగ్‌ను పరిశీలించి కొత్త బిల్డింగ్అవసరాన్ని గుర్తించారు. త్వరలోనే బిల్డింగ్ మంజూరయ్యే ఛాన్స్ ఉంది.
- కల్పన, ఇంటర్ నోడల్ ఆఫీసర్, పెద్దపల్లి