నిజామాబాద్/ కామారెడ్డి, వెలుగు
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అమ్మాయిలు సత్తా చాటారు. ఇంటర్ ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా 60 శాతం ఫలితాలు సాధించింది. ఎప్పటి లాగే ఈసారి ఉత్తీర్ణతలో బాలికలు పైచేయి సాధించారు. రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయా కాలేజీ మెనేజ్మెంట్లు మంగళవారం సాయంత్రం సన్మానించాయి. నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు 15,315 మంది రాయగా 7,782 పాసై 58 శాతం ఉత్తీర్ణత సాధించారని జిలా ఇంటర్విద్యాధికారి రఘురాజ్ తెలిపారు. రెండో సంవత్సరం పరీక్షలు 14,086 మంది విద్యార్థులు రాయగా 8,561 మంది విద్యార్థులు పాస్ అయ్యారని వివరించారు. వారిలో బాలురు 6,391 కాగా బాలికలు 3,284 ఉన్నారన్నారు. బాలికలు 7,695 మంది పరీక్షలకు హాజరు కాగా 5,277 మంది పాస్ అయ్యారని చెప్పారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 15 మంది రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారన్నారు. .
13వ స్థానంలో కామారెడ్డి జిల్లా ..
ఇంటర్మీడియట్ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా స్టేట్‌లో 13వ స్థానంలో నిలిచింది. ఫలితాల్లో అమ్మాయిలే సత్తా చాటారు. గవర్నమెంట్ కాలేజీల్లోనూ మెరుగైన ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలకు చెందిన స్టూడెంట్స్ అత్యుత్తమ మార్కులు సాధించారు. సెకండియర్‌లో 67 శాతం, ఫస్ట్ ఇయర్లో 50 శాతం మంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు.
5,064 మంది స్టూడెంట్స్ పాస్..
సెకండియర్‌లో మొత్తం 7,543 మంది స్టూడెంట్స్ హాజరు కాగా ఇందులో 5,064 మంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు. మొత్తం 3,814 మంది అమ్మాయిలలో 2,787 మంది , బాయిస్ 3,729 మందిలో 2,277 మంది పాస్ అయ్యారు. ఫస్ట్ ఇయర్లో మొత్తం 8,262 మంది స్టూడెంట్స్ పరీక్షకు హాజరయితే 4,146 మంది పాస్ అయ్యారు. 4,119 మంది అమ్మాయిలుఎగ్జామ్కు హాజరయితే 2,334 మంది, అబ్బాయిలు 4,143 మందిలో 1,812 మంది పాస్ అయ్యారు. వొకేషనల్ సెకండ్ ఇయర్లో మొత్తం 1,003 మంది స్టూడెంట్స్‌కు గాను 676 మంది పాస్ అయ్యారు. ఫస్ట్ ఇయర్లో 1,261 మందికి గాను 699 మంది ఫాస్ అయ్యారు.
గవర్నమెంట్ కాలేజీల్లో..
గవర్నమెంట్ కాలేజీలో కూడా మంచి ఫలితాలు వచ్చాయి. పలు కాలేజీలకు చెందిన స్టూడెంట్స్ రాష్ర్ట స్థాయిలో మంచి మార్కులు సాధించారు. భిక్కనూరు గవర్నమెంట్ కాలేజీకి చెందిన స్టూడెంట్ యోగేశ్ కు ఇంగ్లీష్ మీడియం ఎంపీసీలో ఇ988 మార్కులు వచ్చాయి. తెలుగు మీడియంలో భవానీకి 967 మార్కులు వచ్చాయి. లింగంపేట గవర్నమెంట్ కాలేజీ స్టూడెంట్ ఉదయ్ తేజకు బైపీసీలో 950 మార్కులు, ఎంపీసీలో అక్షితకు 945 మార్కులు వచ్చాయి. రామారెడ్డి కాలేజీ స్టూడెంట్ శివానీకి బైపీసీలో 977 మార్కులు వచ్చాయి.
మిగతా కాలేజీల్లోనూ
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాందీపని కాలేజీ స్టూడెంట్స్ ఇంటర్ ఫలితాల్లో తమ సత్తా చాటారు. సెకండ్ ఇయర్ ఎంపీసీలో ఎండీ జహీంగీర్ 989 మార్కులు, సింధూరికి 987 , ఫాతిమాకు 986 మార్కులు వచ్చాయి. బైపీసీలో నవీనాకు 991, సయ్యద సఫా అసిమాకు 989 , సీఈసీలో హీబా షజాకు 976, ఎంఈసీలో హరికకు 973 మార్కులు వచ్చాయి. ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో సుప్రత, స్ఫూ ర్తిలకు 466 చొప్పున, బైపీసీలో కె.అఖిలకు 433, రియాజ్ఖాన్కు 430, సీఈసీలో అజయ్‌కుమార్‌కు 476, ఎంఈసీలో దిషాజైన్479 మార్కులు సాధించినట్లు విద్యా సంస్థల యాజమాన్యం ప్రతినిధులు తెలిపారు. వశిష్ట జూనియర్ కాలేజీ సెకండ్ ఇయ్యర్స్టూడెంట్స్ అప్స కుల్సుమ్ 979, సీఈసీలో మదినా నాజ్ 972 మార్కులు సాధించారు. బైపీసీలో రింశా పర్వీన్ 427 మార్కులు సాధించారు. ఎస్ఆర్కె జూనియర్ కాలేజీ.. ఫస్ట్ ఇయర్లో ఎంపీసీలో స్నేహా 452 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది.