- హవేలి ఘనపూర్ హైస్కూల్‌లో బాలికల దుస్థితి
- బాలికలు 232 మంది ఉన్న ఒక్క టాయిలెట్ కూడా లేని వైనం
మెదక్, వెలుగు : మెదక్ జిల్లా హవేలి ఘనపూర్మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో టాయిలెట్స్లేక విద్యార్థినులు చుట్టూ నిలబడితే మధ్యలో ఒకరి తర్వాత ఒకరు పనినకానివ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ స్కూల్‌లో 540 మంది స్టూడెంట్స్ఉండగా, వారిలో 232 మంది బాలికలే.
గతంలో బాయ్స్‌కు ఒకటి, గర్ల్స్‌కు ఒకటి చొప్పున టాయిలెట్స్ ఉండేవి. కానీ మెయింటెనెన్స్ లేక ఆ రెండూ మూలనపడ్డాయి. గత బీఆర్‌ఎస్ హయాంలో ‘మన ఊరు మన బడి’ కింద టాయిలెట్స్ నిర్మాణం చేపట్టారు. కానీ కాంట్రాక్టర్‌కు బిల్లులు మంజూరు కాకపోవడంతో పనులు అర్థంతరంగా ఆగిపోయాయి. దీంతో బాయ్స్ ఆరు బయటకు వెళ్తుండగా, గర్ల్స్ పరిస్థితి దయనీయంగా మారింది.