
- ఉమ్మడి జిల్లాలో ఫస్ట్, సెకండ్ ఇయర్లో పాలమూరు టాప్
- ఒకేషనల్ లోమొదటి స్థానంలో నిలిచిన నారాయణపేట
మహబూబ్‌నగర్, వెలుగు: ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. ఫస్ట్, సెకండ్ ఇయర్‌తో పాటు ఒకేషనల్ విభాగాల్లో బాయ్స్ కంటే బాలికలే ఎక్కువ మంది పాస్ అయ్యారు. ఉమ్మడి జిల్లాలో ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్లో పాలమూరు మొదటి స్థానంలో నిలువగా.. ఒకేషనల్ విభాగంలో ఫస్ట్, సెకండ్ ఇయర్లో నారాయణపేట జిల్లా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది.
ఫస్ట్ ఇయర్ ఫలితాలు ఇలా..
గద్వాలలో రెగ్యులర్ ఫస్ట్ ఇయర్లో 3,260 మంది పరీక్షలకు అటెండ్ కాగా, 57.18 శాతంతో 1,864 మంది పాస్ అయ్యారు. వీరిలో బాయ్స్ 1,465 మందికి గాను 645, బాలికలు 1,795కి గాను 1,219 మంది పాస్ అయ్యారు. మహబూబ్‌నగర్‌లో 8,917 మందికి గాను 62.78 శాతంతో 5,598 మంది పాస్ అయ్యారు. వీరిలో బాయ్స్ 4,030కి గాను 2,110 మంది, బాలికలు 4,887కి గాను 3,488 మంది పాస్ అయ్యారు. నాగర్‌కర్నూల్‌లో 4,899 మంది పరీక్షలకు అటెండ్ కాగా 47.79 శాతంతో 2,341 మంది ఉత్తీర్ణత సాధించారు.
వీరిలో బాయ్స్ 1,936కి గాను 567, బాలికలు 2,963కి గాను 1,774 మంది ఉత్తీర్ణత సాధించారు. నారాయణపేటలో 3,726 మంది అటెండ్ కాగా 54.40 శాతంతో 2,027 మంది పాస్ అయ్యారు. వీరిలో బాయ్స్ విభాగంలో 1,567కి గాను 602 మంది, బాలికల విభాగంలో 2,159కి గాను 1,425 మంది ఉత్తీర్ణత సాధించారు. వనపర్తిలో 5,293 మందికి గాను 58.62 శాతంతో 3,103 మంది పాస్ అయ్యారు. వీరిలో బాయ్స్ 2,578 మందికి గాను 1,229, బాలికలు 2,715 మందికి గాను 1,874 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఇంటర్ సెకండ్ ఇయర్లో..
ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్‌లో గద్వాలలో 2,963 మందికి గాను 68.07 శాతంతో 2,017 మంది పాస్ అయ్యారు. వీరిలో బాయ్స్ 1,331 మందికి గాను 756 మంది, బాలికలు 1,632 మందికి 1,261 మంది పాస్ అయ్యారు. మహబూబ్‌నగర్‌లో 8,225 మంది పరీక్షలు రాయగా 69.59 శాతంతో 5,724 మంది పాస్ అయ్యారు. నాగర్‌కర్నూల్‌లో 4,629 మందికి గాను 62.82 శాతంతో 2,908 మంది పాస్ అయ్యారు. వీరిలో బాయ్స్ 1,742 మందికి గాను 817, బాలికలు 2,887కు గాను 2,091 మంది పాస్ అయ్యారు. నారాయణపేటలో 3,203 మంది పరీక్షలు రాయగా 67.03 శాతంతో 2,147 మంది పాస్ అయ్యారు. వీరిలో బాయ్స్1,298కి 705 మంది, బాలికలు 1,905 మందికి 1,442 మంది పాస్ అయ్యారు. వనపర్తిలో 4,748 మందికి గాను 67.35 శాతంతో 3,198 మంది పాస్ అయ్యారు. వీరిలో బాయ్స్ 2,236 మందికి 1,303, బాలికలు 2,515కు గాను 1,895 మంది పాస్ అయ్యారు.
ఒకేషనల్ ఫస్ట్ ఇయర్లో..
ఒకేషనల్ఫస్ట్ ఇయర్ లో గద్వాలలో 794 మందికి గాను 67.76 శాతంతో 538 మంది పాస్ అయ్యారు. వీరిలో బాయ్స్ 372 మందికి 178 మంది, బాలికలు 422 మందికి 360 మంది పాస్ అయ్యారు. మహబూబ్‌నగర్‌లో 2,006 మంది పరీక్షలకు అటెండ్ కాగా 70.74 శాతంతో 1,419 మంది పాస్ అయ్యారు. వీరిలో బాయ్స్ 871 మందికి గాను 465, బాలికలు 1,135 మందికి 954 మంది ఉత్తీర్ణత సాధించారు. నాగర్‌కర్నూల్‌లో 1,578 మందికి గాను 51.84 శాతంతో 818 మంది పాస్ అయ్యారు.
వీరిలో బాయ్స్ 881 మందికి గాను 303, బాలికలు 697 మందికి గాను 515 మంది పాస్ అయ్యారు. నారాయణపేటలో 573 మందికి గాను 80.45 శాతంతో 461 మంది పాస్ అయ్యారు. వీరిలో బాయ్స్ 150 మందికి గాను 87 మంది, బాలికలు 423కి గాను 374 మంది ఉత్తీర్ణత సాధించారు. వనపర్తిలో 1,163 మందికి గాను 61.65 శాతంతో 717 మంది పాస్ అయ్యారు. వీరిలో బాయ్స్ 516 మందికి 210 మంది, బాలికలు 647కి గాను 507 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఒకేషనల్ సెకండ్ ఇయర్లో..
ఒకేషనల్ సెకండ్ ఇయర్ రెగ్యులర్ విభాగంలో గద్వాలలో 653 మందికి 69.53 శాతంతో 454 మంది పాస్ అయ్యారు. వీరిలో బాయ్స్ 278 మందికి 131, బాలికలు 375కి 323 మంది ఉత్తీర్ణత సాధించారు. మహబూబ్‌నగర్‌లో 1,721 మందికి గాను 79.72 శాతంతో 1,372 మంది పాస్ అయ్యారు. వీరిలో బాయ్స్ 681కి 454, బాలికలు 1,040కి 918 మంది పాస్ అయ్యారు. నాగర్‌కర్నూల్‌లో 1,270 మందికి గాను 67.95 శాతంతో 863 మంది పాస్ అయ్యారు. వీరిలో బాయ్స్ 641కి గాను 335, బాలికలు 629కు 528 మంది ఉత్తీర్ణత సాధించారు. నారాయణపేటలో 536 మందికి గాను 84.51 శాతంతో 453 మంది పాస్ అయ్యారు. వీరిలో బాయ్స్ 159కి 106 మంది, బాలికలు 377కు 347 మంది ఉత్తీర్ణత సాధించారు. వనపర్తిలో 946 మందికి గాను 64.59 శాతంతో 611 మంది పాస్ అయ్యారు. వీరిలో బాయ్స్ 393కి 164 మంది, బాలికలు 553కి 447 మంది పాస్ అయ్యారు.