తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి

 వేములవాడ రూరల్, వెలుగు : తాటిచెట్టు పైనుంచి పడి ఓ గీత కార్మికుడు చనిపోయాడు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్‌‌‌‌ మండలం ఎదురుగట్ల గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన పొన్నం పరశురాం (55) ఆదివారం కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు మోకు జారడంతో కింద పడి స్పాట్‌‌‌‌లోనే చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య దేవేంద్ర, నలుగురు కుమార్తెలు ఉన్నారు. మృతుడి ఫ్యామిలీని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్‌‌‌‌ సోయినేని కరుణాకర్, గ్రామస్తులు కోరారు.