తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి

తుంగతుర్తి, వెలుగు: తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి చెందాడు.  పోలీసుల వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం గుండెపురి గ్రామానికి చెందిన పాలకుర్తి వెంకన్న (40) వృత్తి రీత్యా గీత కార్మికుడు.  ఆదివారం ఉదయం తాడిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు.  తోటి కార్మికులు గమనించి ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే చనిపోయాడు.  మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.