ఎయిర్​ఫోర్స్​తో గీతం వర్సిటీ ఒప్పందం

ఎయిర్​ఫోర్స్​తో గీతం వర్సిటీ ఒప్పందం

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు : సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పరిధిలోని గీతం డీమ్డ్​వర్సిటీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మధ్య​ఒక ఒప్పందం కుదిరింది. ఎయిర్​ఫోర్స్​సిబ్బంది పిల్లలకు రాయితీ సీట్లు, గీతం చేపట్టే పరిశోధనలకు ఐఏఎఫ్​ సహకారంపై గురువారం ఇండియన్​ ఎయిర్​ ఫోర్స్ వైస్​మార్షల్​రాజీవ్​శర్మ, గీతం వైస్​ఛాన్స్​లర్​ ప్రొఫెసర్​డీఎస్​ రావు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఐఏఎఫ్ సిబ్బంది, వితంతువుల పిల్లలకు నీట్ యూజీ ప్రవేశాల్లో రాయితీ సీట్లు, అర్హత గల స్టూడెంట్స్​కు ఇంజినీరింగ్ ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

ఐదేళ్ల పాటు అమలులో ఉండే ఈ ఒప్పందం ప్రకారం స్టూడెంట్స్​ప్రతిభ ఆధారంగా 50 శాతం వరకు ట్యూషన్ ఫీజులో రాయితీ దక్కుతుందని తెలిపారు. గీతం అందించే స్కాలర్​షిప్​లకు అప్లై చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు. గీతం వర్సిటీ యాజమాన్యం అందిస్తున్న ఈ సహకారానికి ఐఏఎఫ్​ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎయిర్​ఫోర్స్​కమాండర్​పంకజ్​జైన్, గ్రూప్​ కెప్టెన్​రచనా జోషి, గీతం కోర్​ఇంజినీరింగ్ డీన్ ప్రొఫెసర్​వీఆర్​శాస్ర్తీ, సివిల్ ఇంజినీరింగ్ హెడ్ అఖిలేష్ పాల్గొన్నారు.