భార్యకు డ్రగ్స్​ ఇచ్చి రేప్ చేయించిండు

భార్యకు డ్రగ్స్​ ఇచ్చి రేప్ చేయించిండు
  • పదేండ్లలో 74 మందితో 92సార్లు అత్యాచారం
  • ఫ్రాన్స్​లో ఓ భర్త నిర్వాకం

ప్యారిస్: ఓ సైకో భర్త తన భార్యపైనే అపరిచితులతో పలుమార్లు అత్యాచారం చేయించాడు. ఆమెకు డ్రగ్స్ ఇచ్చి, మత్తుగా నిద్రపోగానే ఈ దారుణాలు చేయించాడు. అలా పదేండ్లలో మొత్తం 74 మందితో 92 సార్లు రేప్ చేయించినట్లు పోలీసులు తేల్చారు. ఫ్రాన్స్​లోని అవిగోన్ టౌన్ మజాన్ అనే గ్రామంలో బయటపడిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉండగా.. కోర్టు ట్రయల్స్ నడుస్తున్నాయి.   

వెబ్​సైట్ ద్వారా అపరిచితులతో కాంటాక్ట్

ఫ్రాన్స్​ విద్యుత్ శాఖలో రిటైర్డ్ ఉద్యోగి డొమినిక్ పి(71) కొద్దిరోజులకు ఓసారి తన భార్య బాబోన్నో తినే అన్నంలో మత్తుమందు కలిపి ఇచ్చేవాడు. ఆమె నిద్రలోకి వెళ్లాక అపరిచితులను ఇంటికి పిలిపించుకుని అత్యాచారం చేయించేవాడు. ఆ ఘోరాన్ని సీక్రెట్ కెమెరాల్లో రికార్డు చేసి చూసేవాడు. ఈ దారుణాలను ఆమెకు తెలియకుండా పదేండ్లపాటు నడిపించాడు. అన్నేండ్లలో మొత్తం 74 మంది బాబోన్నోను 92సార్లు రేప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వాళ్లలో 51 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. అరెస్టయినోళ్లలో 26 ఏండ్ల నుంచి 74 ఏండ్ల ముసలివాళ్లు కూడా ఉన్నారని తెలిపారు. 

కేసు బయటపడిందిలా.. 

2020 సెప్టెంబర్​లో ఓ షాపింగ్​మాల్​ ట్రయల్ రూమ్​లో మహిళలు డ్రెస్ చేంజ్ చేసుకుంటుండగా డొమినిక్ సీక్రెట్​గా వీడియో రికార్డ్ చేయడాన్ని సెక్యూరిటీ గార్డ్ పట్టుకున్నాడు. పోలీసులు అరెస్ట్ చేసి అతడి ఇంట్లో తనిఖీలు చేశారు. డొమినిక్ కంప్యూటర్​లో అతడి భార్యకు సంబంధించిన వందలాది వీడియోలు కనిపించాయి. ఆమె అపస్మారక స్థితిలో ఉండగా వేర్వేరు వ్యక్తులు రేప్​ చేస్తున్న వీడియోలను గుర్తించారు. దర్యాప్తు చేయగా అవన్నీ డొమినిక్ చేయించినవేనని తేలింది. ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు ముందు కొంతమంది మహిళలు ఆందోళన చేశారు.