జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఈసీ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: జీహెచ్‌ఎంసీ ఎలక్షన్ల సందర్భంగా ప్రచారం చేసుకోవడానికి అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి సోమవారం ఆదేశించారు. బస్టాపులు, మెట్రో పిల్లర్లు, టాయిలెట్లపై అన్ని రాజకీయ పార్టీలు, పోటీ చేస్తున్న అందరు క్యాండిడేట్లు తమ ప్రచార హోర్డింగ్స్ ఏర్పాటు చేసుకునేందుకు చాన్స్ ఇవ్వాలన్నారు. సంబంధిత హోర్డింగుల అడ్వర్టైజ్‌మెంట్ లీజులు పొందిన ఏజెన్సీలతో సంప్రదించి ఈ మేరకు చర్యలు చేపట్టాలని సూచించారు. సంబంధిత రాజకీయ పార్టీలు, క్యాండిడేట్లు ఆయా అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీలను సంప్రదించి ఫీజు చెల్లించి యాడ్స్ఏర్పాటు చేసుకోవాలన్నారు. హైదరాబాద్‌లోని అన్ని హోర్డింగులపై టీఆర్‌ఎస్ ప్రకటనలు మాత్రమే ఏర్పాటు చేశారని, ప్రతిపక్షాలకు చాన్స్ లేకుండా చేశారని పేర్కొంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు, కొందరు క్యాండిడేట్లు ఎలక్షన్ కమిషన్‌కు కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంనే ఈసీ ఈ ఆదేశాలు జారీ చేసింది.
పెళ్లిళ్లు, ట్రీట్మెంట్ డబ్బులకూ ఆధారాలు కావాలె
జీహెచ్ఎంసీ ఎలక్షన్ నేపథ్యంలో.. వివిధ అవసరాలకు డబ్బు తరలించుకునే వారు సంబంధిత ఆధారాలను వెంట ఉంచుకోవాలని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. ఏటీఎం సెంటర్లకు క్యాష్ తరలించే వెహికల్స్‌లో అన్ని డాక్యుమెంట్లు అందుబాటులో ఉంచుకోవాలని బ్యాంకులను ఆదేశించింది. ఎంత క్యాష్ రిలీజ్ చేశారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న పూర్తి వివరాలు ఉండాలని సూచించింది. ఇక ఎవరైనా వ్యక్తులు తమ వ్యాపార సంస్థ నుంచి బ్యాంకుల్లో నగదు జమ చేయడానికి తీసుకెళ్తుంటే విధిగా పాన్ కార్డు, బిజినెస్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, బ్యాంక్ పాస్ బుక్, క్యాష్ స్టేట్‌మెంట్, ఈసీ జారీ చేసిన డిక్లరేషన్ ఫారం వెంట తీసుకెళ్లాలని తెలిపింది. అన్ని ఆధారాలుంటే డబ్బు సీజ్ చేయబోమని, లేకుంటే సీజ్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. పెళ్లిళ్లు, మెడికల్ ట్రీట్మెంట్ వంటి అవసరాలకు డబ్బు తరలించేవారు కూడా తగిన ఆధారాలు దగ్గర ఉంచుకోవాలని సూచించింది.
for more News…
ఎలక్షన్లు రాంగనే… ఓటర్లపై ప్రేమ పుట్టె
పేరుకే మహిళా కార్పొరేటర్లు.. పెత్తనమంతా భర్తలదే