- అవయవదానంతో ముగ్గురికి లైఫ్ ఇచ్చిండు
- బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి ఆర్గాన్స్ డొనేషన్
- కుటుంబసభ్యులను ఒప్పించిన పేస్ హాస్పిటల్ డాక్టర్లు
హైదరాబాద్, వెలుగు: యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్‌కు గురైన ఓ యువకుడు అవయవ దానంతో ముగ్గురికి లైఫ్నిచ్చాడు. ఇందుకోసం యువకుడి కుటుంబీకులను హైటెక్‌సిటీలోని పేస్హాస్పిటల్ డాక్టర్లు ఒప్పించారు. జనగామ జిల్లాకు చెందిన ఓ యువకుడు(19) కొద్దిరోజుల కిందట రోడ్ యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డాడు. తలకు బలమైన దెబ్బ తగలడంతో అతడిని వరంగల్‌లోని ఎంజీఎం హాస్పిటల్లో చేర్చారు. ఆపై మైరుగైన ట్రీట్మెంట్కోసం హైటెక్‌సిటీలోని పేస్హాస్పిటల్కు తీసుకొచ్చారు. కాగా అతడిని కాపాడేందుకు డాక్టర్లు తీవ్రంగా కృషి చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తలకు బలమైన గాయం కారణంగా అతడు బ్రెయిన్డెడ్అయినట్లు డాక్టర్లు వెల్లడించారు.
కాగా మృతుడి అవయవాలతో ఇతరులను బతికించవచ్చని అతడి కుటుంబీకులకు అర్థమయ్యేలా చెప్పిన డాక్టర్లు ఆర్గాన్డొనేషన్కు వారిని ఒపించారు. తమ హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్న ఓ 50 ఏండ్ల పేషెంట్‌కు లివర్, మరో 50 ఏళ్ల వ్యక్తికి కిడ్నీని విజయవంతంగా అమర్చారు. వారు కోలుకుంటున్నట్లు పేస్ హాస్పిటల్మేనేజ్మెంట్ ఓ ప్రకటనలోతెలిపింది. మరో కిడ్నీని ట్రాన్స్ప్లాంటేషన్కోసం నిమ్స్హాస్పిటల్కు తరలించినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా యువకుడి కుటుంబీకులకు లివర్ట్రాన్స్ప్లాంట్సర్జన్డాక్టర్ఫణి కృష్ణ ధన్యవాదాలు తెలిపారు.