మా ఎమ్మెల్యే కేసీఆర్ ను కలిసే చాన్స్‌‌ ఇప్పించండి

మా ఎమ్మెల్యే కేసీఆర్ ను కలిసే చాన్స్‌‌ ఇప్పించండి
  • బీఆర్‌‌ఎస్‌‌ నేతలకు ఆ పార్టీ కార్యకర్తల విజ్ఞప్తి
  • కేసీఆర్‌‌ బయటకు రాకపోవడంతో తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదని ఆవేదన

తూప్రాన్, వెలుగు : గజ్వేల్‌‌ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కేసీఆర్‌‌ను గెలిపించుకుంటే.. ఆయన ఇప్పుడు ఎవరినీ కలవడం లేదని మెదక్‌‌ జిల్లా మనోహరాబాద్‌‌ మండల బీఆర్ఎస్‌‌ కార్యకర్తలు వాపోయారు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియడం లేదన్నారు. జిల్లా నాయకుడు శేఖర్‌‌గౌడ్‌‌ ఆధ్వర్యంలో తూప్రాన్  మండలం ఇమాంపూర్‌‌ శివారులోని ఓ గెస్ట్‌‌హౌస్‌‌లో ఆదివారం బీఆర్‌‌ఎస్‌‌ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఉద్యమకాలం నుంచి కష్టపడి పనిచేసి పార్టీకి సేవలందిస్తున్న కార్యకర్తలను ఏ నాయకుడూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలల కింద మండల పార్టీ అధ్యక్షుడు మారితే.. ఇప్పటివరకు కొత్త అధ్యక్షుడిని నియమించడంలేదన్నారు. మాజీమంత్రి హరీశ్‌‌రావు చొరవ తీసుకుని మండలంలో నాయకులు, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి, మండల అధ్యక్షుడిని ఎన్నుకోవాలని కోరారు. నాయకులు స్పందించి కేసీఆర్‌‌ను కల్పిస్తే తమ  బాధలు చెప్పుకుంటామని కోరారు.