హైదరాబాద్, వెలుగు : సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో రోజూ నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించడం ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో లెక్క లను లాగ్ బుక్స్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని వాటర్‌బోర్డు ఎండీ సుదర్శన్‌రెడ్డి సూచించారు. రెండ్రోజులుగా సిటీలోని వివిధ ప్రాంతాల్లో ఎస్టీపీల నిర్మాణ పనులను తనిఖీ చేస్తుండగా.. మంగళవారం ఓల్డ్ సిటీలోని మీరాలం ట్యాంక్ వద్ద వాటర్‌బోర్డు నిర్మిస్తున్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను పరిశీలించారు.
ఎస్టీపీ ఇన్ లెట్ వద్ద సీవరేజీ ఇన్ ఫ్లోని పరిశీలించి ఏయే ప్రాంతాల నుంచి మురుగు వస్తుందని ఆరా తీశారు. అనంతరం ఎస్టీపీలో మురుగు నీటి శుద్ధి ప్రక్రియను చూశారు. ఆయన వెంట ఈడీ ఎం. సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు, సీజీఎం సుదర్శన్, ఇతర అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఉన్నారు.