సింగరేణిలో 485 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వండి: భట్టి విక్రమార్క

సింగరేణిలో 485 పోస్టులకు నోటిఫికేషన్లు వేయాలని సీఎండి బలరామ్ కు ఆదేశాలు జారీచేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ ఏడాది వెయ్యి మందికి సింగరేణిలో కారుణ్య నియామకాలు చేపడతామన్నారు. వయోపరిమితి 40ఏళ్లకు పెంపుపై నిర్ణయం తీసుకోవాలని భట్టి సూచించారు.  హైదరాబాద్‌లో సింగరేణి అతిథిగృహానికి త్వరలో భూమిపూజ చేయనున్నారు డిప్యూటీ సీఎం.  సింగరేణి అభివృద్ది, సంక్షేమ కార్యాక్రమాలపై సచివాలయం నుంచి వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు భట్టి విక్రమార్క.  ఈ నెల 26న కొత్తగూడెంలో 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభానికి సిద్దం చేయాలని అధికారులకు తెలిపారు.  వేసవిలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూడాలన్నారు.