సినీ గేయ రచయిత అందెశ్రీకి పదవి ఇచ్చే ఆలోచన ఉందని ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ ప్రతి స్పీచ్ లో లో గద్దర్, అందెశ్రీ పేరు ప్రస్తావన చేస్తున్నారని, వారిద్దరికి ఎంతో గౌరవం, మర్యాద ఇస్తున్నామని తెలిపారు. ‘అసెంబ్లీలో సీఎం రేవంత్ బీఆర్ఎస్ నేతలను అరుస్కుంటుండు కాబట్టే ఓటుకు నోటు కేసు తెరపైకి తెచ్చారు. ముఖ్యమంత్రికి ఇచ్చిన నోటీసులో పస లేదు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నరు. కానీ టిక్కెట్లు ఇవ్వలేం కదా. వారంలోగా ఎంపీ అభ్యర్థులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది’ అని పేర్కొన్నారు.
ALSO READ :- UI Movie: హైదరాబాద్లో దిగిన ఉపేంద్ర..UI తెలుగు డబ్బింగ్ షురూ