వైరల్: అదిరేటి స్టెప్పు నేనేస్తే.. భారత పౌరసత్వం రాదా..!

వైరల్: అదిరేటి స్టెప్పు నేనేస్తే.. భారత పౌరసత్వం రాదా..!

మన ఇండియన్ సాంగ్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. మన సాంగ్స్ కు ఎంతో మంది విదేశీయులు సైతం కాలు కదుపుతుంటారు. సోషల్ మీడియా రీల్స్ లో మన పాటలు ట్రెండ్ అవడం మనం చూస్తూనే ఉంటాం.  నోయెల్ రాబిన్సన్, కిలీ పాల్, రికీ పాండ్ వంటి అనేక మంది విదేశీయులు మన ఇండియన్ సాంగ్స్ పై రీల్స్ చేస్తూ అలరిస్తూ ఉన్నారు. తాజాగా  రికీ పాండ్ బీహార్‌ పాటకు అదిరే స్టెప్పులు వేసి వైరల్ అవుతున్నారు.

ఇంటర్నెట్ డ్యాన్సింగ్ డాడ్ గా పేరున్న   రికీ పాండ్ భోజ్‌పురి పాట హుక్ రాజా జీకి స్టెప్పులు వేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.  అందులో అతడు వేసిన దేశీ స్టెప్స్ వీక్షకులను అలరిస్తు్న్నాయి. ఈ వీడియోను జూలై 27న ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా ఇప్పటికే 5.5 మిలియన్ల వ్యూస్ దాటి 6 మిలియన్ల వ్యూస్ వైపు పరుగెడుతోంది.  కాగా దీనిపై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది చాలా బాగా డ్యాన్స్ చేశారని కామెంట్స్ చేస్తే.. మరికొందరు రికీ పాండ్ కు భారత పౌరసత్వం ఇవ్వాలని కామెంట్స్ చేస్తున్నారు.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ricky Pond (@ricky.pond)

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ricky Pond (@ricky.pond)