నువ్వు మా రాజువి కాదు...కింగ్ చార్లెస్‌‌కు వ్యతిరేకంగా ఆస్ట్రేలియన్ సెనేటర్ నినాదాలు

నువ్వు మా రాజువి కాదు...కింగ్ చార్లెస్‌‌కు వ్యతిరేకంగా ఆస్ట్రేలియన్ సెనేటర్ నినాదాలు

కాన్‌‌బెర్రా: బ్రిటన్ కింగ్ చార్లెస్3, క్వీన్ కెమిల్లా పార్కర్ కు ఆస్ట్రేలియన్ పార్లమెంట్ హౌస్‌‌లో  చేదు అనుభం ఎదురైంది. తొమ్మిది రోజుల ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆయన..సోమవారం కాన్‌‌బెర్రాలోని గ్రేట్ హాల్ ఆఫ్ పార్లమెంట్ హౌస్‌‌లో ఎంపీలు, సెనేటర్‌‌లను ఉద్దేశించి ప్రసంగించారు. కింగ్ చార్లెస్3 మాట్లాడటం పూర్తయిన వెంటనే విక్టోరియాకు చెందిన సెనేటర్ లిడియా థోర్పే రాచరికానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 


"మా భూమిని మాకు తిరిగి ఇచ్చేయండి. మా నుంచి దోచుకున్నవి మొత్తం వాపస్ ఇవ్వండి. ఇది మీ భూమి కాదు. మీరు మా రాజూ కాదు. ఆస్ట్రేలియా ఆదివాసీలపై నరమేధానికి పాల్పడ్డారు" అని ఆమె దాదాపు నిమిషం పాటు గట్టిగా నినాదాలు చేశారు. ఈ ఘటనతో పార్లమెంట్ హౌస్‌‌లోని సభ్యులంతా షాక్ అయ్యారు. వెంటనే భద్రతా సిబ్బంది లిడియా థోర్పేను హౌస్‌‌ నుంచి బయటకు తీసుకెళ్లారు. ఆస్ట్రేలియా గతంలో బ్రిటన్ వలస రాజ్యంగా ఉంది. ఇప్పటికీ దానికి బ్రిటన్ కింగ్ చార్లెస్--- 3 రాజుగా వ్యవహరిస్తున్నారు.