ఒక వస్తువుకు గల భౌగోళిక గుర్తింపును ఇవ్వడాన్ని జీఐ గుర్తింపు అంటారు. ఇది ఒక వస్తువు లేదా వస్తువు ఉత్పత్తి చేసే ప్రాంతాన్ని, దాని విశిష్టత నాణ్యతను తెలియజేస్తుంది. భౌగోళిక గుర్తింపు అనేది మేథో సంపత్తి హక్కుల్లో(ఐపీఆర్ఎస్) ఒక భాగంగా గుర్తించబడుతుంది. పారిస్ కన్వెన్షన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీలోని ఆర్టికల్స్ 1(2), 10 కింది ఇవి సూచించబడ్డాయి. భారతదేశంలో వస్తువులకు భౌగోళిక గుర్తింపు చట్టం(రిజిస్ట్రేషన్ రక్షణ) 1999లో వచ్చినా 2013 సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చింది.
వీటిలో తెలంగాణ నుంచి పోచంపల్లి ఇక్కత్, సిల్వర్ తీగపని(కరీంనగర్), నిర్మల్ బొమ్మలు, నిర్మల్ ఫర్నిచర్, నిర్మల్ పెయింటింగ్స్, గద్వాల్ చీరలు, హైదరాబాద్ హలీం, చేర్యాల పెయింటింగ్, పెంబర్తి మెటల్ క్రాఫ్, సిద్దిపేట గొల్లభామ చీరలు, నారాయణపేట చేనేత, పోచంపల్లి ఇక్కత్ (లోగో), ఆదిలాబాద్ డోక్రా, వరంగల్ డర్రీలు, తెలియా రుమాల్, తాండూర్ కందిపప్పు ఉన్నాయి.