ఎలక్షన్ కి గ్లామర్ టచ్

ఎలక్షన్ కి గ్లామర్ టచ్

ఈసారి సినీ తారలను పెద్ద సంఖ్యలో ఎన్నికల బరిలోకి దిం చాలని బీజేపీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. అనేక మంది సినీ ప్రముఖులతో పార్టీ పెద్దలు ఇప్పటికే సంప్రదింపులు మొదలెట్టారు. ఓకే అన్నవారికి కండువా కప్పుతున్నా రు. వాళ్లు కోరుకున్న నియోజకవర్గం లోనే టిక్కెట్‌ ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడేలా లేరు. పార్టీకి సెలబ్రిటీల సపోర్టు కూడగట్టే కార్యక్రమానికి ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ అనే పేరు కూడా పెట్టారు. బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ నిస్వయంగా బీజేపీ చీఫ్ అమిత్ షా కలిసి.. ప్రజలకు సేవ చేయడానికి బీజేపీలో చేరాలని కోరారు. పుణే,ముంబై ల్లో ఏదో ఒక చోట లోక్ సభ టికెట్ ఇస్తామని ఆశ చూపారు. ప్రస్తుతానికి ఆమె ఏ విషయమూ తేల్చిచెప్పలేదు.

మామ గెలిచిన చోట అల్లుడు…

మరో హిం దీ నటుడు అక్షయ్ కుమార్ తో కూడా బీజేపీ హైకమాండ్ సంప్రదింపులు జోరుగా జరుపుతోంది.అక్షయ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే న్యూఢిల్లీ నుంచి పోటీకి దింపాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు పొలిటికల్ సర్కి ల్స్ టాక్. ఆ సెగ్మెం ట్ తో అక్షయ్ ఫ్యామిలీకి ప్రత్యేక అనుబంధం ఉంది. 1992లో జరిగిన ఉపఎన్నికల్లో రాజేష్ ఖన్నా ఇక్కడి నుంచే కాం గ్రెస్ టికెట్ పై గెలిచారు. ఈ లిం కు ఎన్నికల్లో వర్కౌ ట్ అవుతుందని బీజేపీ పెద్దల అంచనా.

సన్నీకి గురుదాస్ పూర్‌ …

అలనాటి నటుడు, మాజీ ఎంపీ ధర్మేంద్ర పెద్ద కొడుకు సన్నీ డియోల్ ని గురుదాస్ పూర్ నుంచి పోటీకి దింపే అవకాశాలు ఉన్నా యి. ఈ నియోజకవర్గం బీజేపీ ఖాతాలోనే ఉండేది. ప్రముఖ నటుడు వినోద్ ఖన్నాఈ సిగ్మెంట్ నుంచే గెలిచి కేంద్ర కేబినెట్ లో పని చేశారు. ఖన్నా చనిపోయాక 2017లో జరిగి న ఉప ఎన్నికలో కాం గ్రెస్ గెలిచింది. ఈసారి గురుదాస్ పూర్ లో కాషాయ జెం డా ఎగరేయాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది.

బెంగాల్ కి మౌసుమి ప్రయోగం…

కుటుంబ కథా చిత్రాల నటి మౌసుమీ ఛటర్జీ ఈమధ్యే బీజేపీలో చేరారు. మౌసుమి రాజకీయాలకు కొత్త కాదు. 2004 లోక్ సభ ఎన్నికల్లో కాం గ్రెస్ టికెట్ పై కోల్ కతా(నార్త్‌–ఈస్ట్‌) నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. చాలా కాలం పాలిటిక్స్​కి దూరంగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో ఢీ అంటే ఢీ అంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో .. మౌసుమీ ఛటర్జీ ప్రవేశంతో పొలిటికల్‌ మైలేజీ పెరుగుతుందని బీజేపీ వర్గా లు భావిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో మౌసుమీ ఛటర్జీ బెం గాల్ లో స్టార్‌ క్యాం పెయినర్‌ కావొచ్చని, లోక్ సభకు పోటీ చేయొచ్చని అంచనా.

లేటెస్ట్ ఎంట్రీ ఇషా…

కొం కిణి మూలాలున్న బాలీవుడ్ నటి ఇషా కొప్పి కర్ తాజాగా బీజేపీలో చేరారు. ముం బైలో జరిగి న ఓ కార్యక్రమంలో ఇషా చేరగానే పార్టీ పదవి కూడా కట్టబెట్టారు. అన్నీ సవ్యం గా జరిగితే మహారాష్ట్రలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసే ఛాన్స్​ లేకపోలేదు. సెలబ్రిటీలకు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలన్నది ప్రధాని మోడీకి వచ్చి న ఆలోచనగా బీజేపీ సర్కిల్ లో టాక్. సిట్టిం గ్ ఎంపీలతో పోలిస్తే కొత్తవారికి సహజంగా గెలిచే అవకాశాలు ఎక్కువ. రాజకీయాలకు కొత్త కాబట్టి, అవినీతి ఆరోపణలు కూడా ఉండవు. పైపెచ్చు గ్లామర్ ఫీల్డ్ నుంచి రావడం వల్ల ప్రజల్లో ఎంతో కొం త ఆదరణ తప్పకుం డా ఉంటుంది. దీం తోసక్సెస్ కి సిగ్నల్స్​ మెరుగుపడతాయన్నది నరేంద్ర మోడీ ఆలోచనగా కనిపిస్తోంది.

కొత్త ఫేస్ లు సేఫ్‌…

కొత్త మొహాలకు ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువనే పొలిటికల్ థియరీ ఒకటుం ది. సినీ తారలు,క్రికెటర్లు తదితర సెలబ్రిటీలను పార్టీలోకి తీసుకొచ్చేకార్యక్రమం (సంపర్క్ ఫర్ సమర్థన్) ఆ సిద్ధాంతం నుంచి పుట్టిందే. కొత్త వాళ్లకు సీట్లిస్తే రాజకీ డిమాండ్ లు పెద్దగా ఉండవన్నది బీజేపీ నేతల ఆలోచన. 2017 ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మోడీ ఇదే ఫార్ములా వాడారు. బీజేపీకి చెం దిన మెజారిటీ కార్పొరేటర్ల పై ప్రజల్లో వ్యతిరేకత రావటంతో చాలా మంది సిట్టిం గ్ లకు టికెట్లు ఇవ్వలేదు. రాజకీయాలతో సంబంధంలేని వారికిచ్చి గెలిపించారు.

మోహన్ లాల్‌కి త్రివేండ్రం…

మలయా ళ నటుడు మోహన్ లాల్ పైనా బీజేపీ ఆశలు పెట్టుకుంది.ప్రధాని మోడీ తో మోహన్ లాల్ కు మంచి సంబంధాలు ఉన్నాయి.తన స్వచ్ఛం ద సంస్థ ‘విశ్వ శాం తి ఫౌండేషన్’ సేవా కార్యక్రమాలను మోహన్ లాల్‌ ప్రధానికి స్వయంగా వివరించారు. మోడీ మానస పుత్రిక ‘స్వచ్ఛ్ భారత్’ని మోహన్ లాల్‌ సపోర్ట్‌ చేస్తున్నారు. దీంతో తిరువనంతపురం నుంచి ఆయన్ని పోటీకి దింపాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుత లోక్ సభలో కాంగ్రెస్ నేత శశి థరూర్ త్రివేండ్రంకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. లెఫ్ట్ పార్టీల ప్రాబల్యం ఉన్న కేరళలో ఇప్పటికే కమలదళం చాలా దూకుడుగా ఉంది. మోహన్ లాల్ ని ట్రంప్ కార్డులా లెఫ్ట్‌ ఫ్రంట్ పైకి విసరాలని చూస్తోంది.