40 ఏండ్లు దాటితే గ్లకోమా టెస్టులు మస్ట్ :డాక్టర్ మోదిని

40 ఏండ్లు దాటితే గ్లకోమా టెస్టులు మస్ట్ :డాక్టర్ మోదిని
  • సరోజిని దేవి ఐ హాస్పిటల్​సూపరింటెండెంట్​ మోదిని

మెహిదీపట్నం, వెలుగు: నలభై ఏండ్లు దాటిన ప్రతిఒక్కరూ ఏటా గ్లకోమా టెస్టులు చేయించుకోవాలని మెహిదీపట్నంలోని సరోజిని దేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోదిని, ప్రొఫెసర్, ఆప్తమాలాజీ స్పెషలిస్ట్​పి.వెంకటరత్నం తెలిపారు. శనివారం వారు మీడియాతో మాట్లాడారు. సోమవారం నుంచి ఆస్పత్రిలో గ్లకోమో వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.

గ్లకోమాపై అవగాహన కల్పిస్తూ 15 ఏండ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం అవగాహన ర్యాలీ ఉంటుందన్నారు. త్రిపుర గవర్నర్ నల్ల ఇంద్రసేనారెడ్డి, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఉన్నతాధికారులు పాల్గొంటారని తెలిపారు. గ్లకోమాతో శాశ్వతంగా కంటిచూపు పోయే ప్రమాదం ఉందని, ముందస్తుగా టెస్టులు చేయించుకుని కండ్లను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు.