న్యూఢిల్లీ: సీజర్ ట్రీట్‌మెంట్‌లో వాడే జనరిక్ మెడిసిన్ టొపిరమేట్‌ను యూఎస్‌లో అమ్మేందుకు ఎఫ్‌డీఏ నుంచి గ్లెన్‌మార్క్ ఫార్మా ఫైనల్ అప్రూవల్స్ అందుకుంది. 15 ఎంజీ, 25 ఎంజీ టొపిరమేట్ క్యాప్సుల్స్‌ను విక్రయించేందుకు యూఎస్ ఎఫ్‌డీఏ అనుమతిచ్చిందని కంపెనీ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.
ఈ మెడిసిన్ జాన్సెన్ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన టొపమ్యాక్స్ 15 ఎంజీ, 25 ఎంజీ క్యాప్సుల్స్‌కు బయోసిమిలర్. ప్రస్తుతం 198 ఆథరైజ్డ్ ప్రొడక్ట్‌లను యూఎస్‌లో అమ్ముతున్నామని గ్లెన్‌మార్క్ ఫార్మా పేర్కొంది. 50 అబ్రివేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్స్ (ఏఎన్‌డీఏ) కు అనుమతులు రావాల్సి ఉందని తెలిపింది.