న్యూఢిల్లీ: తయారీలో సమస్యలు తలెత్తడంతో యూఎస్ మార్కెట్ నుంచి రెండు మందులను గ్లెన్‌మార్క్ రీకాల్ చేసుకుంటోంది. గ్లెన్‌మార్క్ ఫార్మా యూఎస్ సబ్సిడరీ గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఐఎన్‌సీ 45,504 బాటిళ్ల రైల్ట్రీస్ (ఓలోపాటాడైన్ హైడ్రోక్లోరైడ్, మొమెంటసొన్ ఫ్లోరేట్) నాసల్ స్ప్రేను రీకాల్ చేసుకుంటోంది. డెలివరీ సస్టిమ్‌లో సమస్య తలెత్తడంతో కంపెనీ ఈ బాటిళ్ల రీకాల్ చేపడుతోందని యూఎస్ ఎఫ్‌డీఏ పేర్కొంది.
బాటిల్ నుంచి స్ప్రేను ముక్కులోకి వేసుకునేటప్పుడు ట్యూబ్‌లో అడ్డంకి ఏర్పడుతోందని, సరిగ్గా పనిచేయడం లేదని వివరించింది. కిందటి నెల 24 న గ్లెన్‌మార్క్ ఫార్మా ఐఎన్‌సీ క్లాస్ 2 రీకాల్‌ను యూఎస్‌లో చేపట్టింది. దీంతో పాటు 11,568 ట్యూబ్‌ల సిక్లోపిరోక్స్ జెల్‌ను కూడా కంపెనీ రీకాల్ చేస్తోంది. ఈ జెల్ కంటైనర్‌లో లోపం ఉండడంతోనే ఈ రీకాల్‌ను చేపడుతోంది. సీల్ దగ్గర ట్యూబ్ విరిగిపోయిందనే ఫిర్యాదుల వచ్చాయని యూఎస్ ఎఫ్‌డీఏ ప్రకటించింది. కిందటి నెల 30 న క్లాస్ 3 రీకాల్‌ను గ్లెన్‌మార్క్ ఫార్మా ఐఎన్‌సీ మొదలు పెట్టింది.