యూఎస్‌‌‌‌ నుంచి గ్లెన్‌‌‌‌మార్క్‌‌‌‌.. సన్‌‌‌‌ ఫార్మా, జైడస్ మందుల రీకాల్‌‌‌‌

యూఎస్‌‌‌‌ నుంచి గ్లెన్‌‌‌‌మార్క్‌‌‌‌.. సన్‌‌‌‌ ఫార్మా, జైడస్ మందుల రీకాల్‌‌‌‌

న్యూఢిల్లీ: ఫార్మా కంపెనీలు  గ్లెన్‌‌‌‌మార్క్, సన్ ఫార్మా,  జైడస్  తయారీ సమస్యల కారణంగా యూఎస్‌‌‌‌ నుంచి కొన్ని మందులను రీకాల్‌‌‌‌ చేస్తున్నాయి. గ్లెన్‌‌‌‌మార్క్ 25కి పైగా ఉత్పత్తులను రీకాల్ చేస్తోంది. న్యూజెర్సీకి చెందిన గ్లెన్‌‌‌‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్, ప్రొపాఫెనోన్ హైడ్రోక్లోరైడ్ ఎక్స్‌‌‌‌టెండెడ్-రిలీజ్ క్యాప్సూల్స్, సోలిఫెనాసిన్ సక్సినేట్ టాబ్లెట్స్ వంటి మందుల లాట్‌‌‌‌లను  రీకాల్ చేస్తోంది. అలాగే, వోరికోనజోల్ టాబ్లెట్స్, లాకోసామైడ్ టాబ్లెట్స్, ఫ్రోవాట్రిప్టాన్ సక్సినేట్ టాబ్లెట్స్, రుఫినామైడ్ టాబ్లెట్స్ వంటి ఉత్పత్తులను కూడా రీకాల్ చేస్తోంది.   

ఎపిలెప్సీతో బాధపడుతున్నవారిలో  మూర్ఛలను ట్రీట్‌‌‌‌ చేయడానికి  వాడే  గాబాపెంటిన్ క్యాప్సూల్స్‌‌‌‌ను 13,700 బాటిల్స్‌  రీకాల్ చేస్తోంది. జైడస్ ఫార్మాస్యూటికల్స్ (యుఎస్ఏ) ఇంక్, స్కిజోఫ్రీనియా,  బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక జబ్బుల ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌లో వాడే  క్లోర్‌‌‌‌ప్రోమాజైన్ హైడ్రోక్లోరైడ్ టాబ్లెట్స్ రీకాల్ చేపట్టింది.