Cricket World Cup 2023: ఓడిపోతున్నామన్న బాధే లేదు: దమ్ము కొడుతూ దొరికిపోయిన మ్యాక్స్ వెల్

వరల్డ్ కప్ లో భాగంగా దక్షిణాఫ్రికా తో నిన్న(అక్టోబర్ 12) జరిగిన మ్యాచులో ఆస్ట్రేలియా ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. కనీసం పోరాటం కూడా ఇవ్వకుండా 134 పరుగుల భారీ తేడాతో వరల్డ్ కప్ లో వరుసగా రెండో పరాజయాన్ని మూటకట్టుకుంది. 5 సార్లు  ప్రపంచ ఛాంపియన్ లకు ఇలాంటి దుస్థితి రావడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఆసీస్ ఓటమి దాదాపుగా ఖరారైన తరుణంలో గ్లెన్ మ్యాక్స్ వెల్ సిగరెట్ తాగుతూ కెమెరా చేతికి చిక్కాడు. 

312 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా 70 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయింది. జట్టు స్కోర్ 80/6 వద్ద ఉన్నప్పుడు మ్యాక్స్ వెల్ డ్రెసింగ్ రూమ్ బయట సిగరెట్ తాగుతూ కనిపించాడు. గ్రౌండ్ లోని కెమెరాలు ఆసీస్ డ్రెస్సింగ్ రూమ్ వైపుగా తిప్పడంతో మ్యాక్స్ వెల్ చేసిన ఈ పని బయటపడింది. ప్రస్తుతం మ్యాక్సీ చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వెల్ స్మోక్ మ్యాక్సీ అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. 

ALSO READ : Cricket World Cup 2023: 400 కొట్టినా నో గ్యారంటీ.. నేడు సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా బ్లాక్ బస్టర్ మ్యాచ్
 

సాధారణంగా క్రికెట్ లో ఆటగాళ్లకు చాలా కఠిన రూల్స్ ఉంటాయి. ఎంత స్టార్ ఆటగాడైన తప్పు చేసి దొరికితే శిక్షకు విధించాల్సిందే. మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ లాంటి విషయాల్లో లైఫ్ టైం బ్యాన్ పడే అవకాశముంది. అయితే మ్యాక్స్ వెల్ చేసిన ఈ తప్పును ఐసీసీ పట్టించుకుంటుందో లేదో చూడాలి. కాగా .. ఈ  మ్యాచులో 17 బంతులు ఎదుర్కొన్న మ్యాక్స్ వెల్ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి మహారాజ్ బౌలింగ్ లో ఔటయ్యాడు.