ఐపీఎల్ లో భాగంగా నిన్న (ఏప్రిల్ 15) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.హాయ్ స్కోరింగ్ థ్రిల్లర్ లో సన్ రైజర్స్ 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ తమ ప్లేయింగ్ 11 నుండి మ్యాక్స్ వెల్ ను తప్పించింది. బొటన వేలు గాయం నుంచి కోలుకున్నప్పటికీ ఏ ఆసీస్ స్టార్ కు అవకాశం దక్కలేదు. అతని స్థానంలో న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గుసన్ ను ఎంపిక చేశారు. అయితే మ్యాక్స్ వెల్ ఆడకపోవడానికి అసలు కారణం తెలిసిపోయింది.
ఈ మ్యాచ్ లో మ్యాక్సీ తనకు తానుగా తప్పుకున్నట్లు తెలుస్తుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత మ్యాక్స్ వెల్ తన పరిస్థితి గురించి వివరించాడు. "ఇది నాకు చాలా సులభమైన నిర్ణయం. నేను ఆడిన మ్యాచ్ ల్లో విఫలమయ్యాను. నేను ఫాఫ్, కోచ్‌ల వద్దకు వెళ్లి.. మనం వేరొకరిని ప్రయత్నించే సమయం వచ్చిందని చెప్పాను. గతంలోనూ నాకు ఇలాంటి పరిస్థితిలే ఎదురయ్యాయి. ప్రస్తుతం నేను మానసికంగా, శారీరకంగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా. అని మ్యాచ్ తర్వాత మ్యాక్స్ వెల్ అన్నాడు.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ మ్యాక్స్ వెల్ కు అసలు కలిసి రావడం లేదు. బ్యాటింగ్ ఇలా వచ్చి అలా వెళ్తున్నాడు. పట్టుమని పది బంతులు ఆడకుండా కనీసం రెండంకెల స్కోర్ చేయకుండానే పెవిలియన్ కు చేరుతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ విధ్వంసకర వీరుడు..దారుణంగా విఫలమవుతున్నాడు. 6 ఇన్నింగ్స్ ల్లో మొత్తం 32 పరుగులు చేసి ఘోరంగా విఫలమయ్యాడు. మరి జరగబోయే కీలక మ్యాచ్ లోనైనా మ్యాక్స్ వెల్ ఫామ్ అందుకుంటాడో లేదో చూడాలి.
Glenn Maxwell approached Faf Du Plessis and coaches and asked them to drop him due to his underwhelming performance.
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 16, 2024
- Maxwell wanted to give others opportunities, he'll be available for RCB if needed later. 👏 pic.twitter.com/31fwvJla2D