ఐపీఎల్ నేడు (ఏప్రిల్ 15) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ తో కీలక పోరుకు సిద్ధమవుతుంది. అసలే వరుస పరాజయాలు వెంటాడుతున్న ఆర్సీబీ ఫ్యాన్స్ కు మ్యాక్స్ వెల్ గాయం కలవరపెడుతుంది. పేలవ ఫామ్ లో ఉన్నా.. మ్యాక్సీ మ్యాచ్ విన్నర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్కసారి గాడిలో పడితే ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేయగలడు. ఇప్పటికే ఆడిన 6 మ్యాచ్ ల్లో ఒకటే మ్యాచ్ గెలిచిన ఆర్సీబీ.. ఈ మ్యాచ్ లో గెలవడం తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో గాయంతో ఇబ్బందిపడుతున్న మ్యాక్స్ వెల్ ఈ మ్యాచ్ లో ఆడతాడా లేదా అనే అనుమానం ఫ్యాన్స్ ను వెంటాడుతుంది.
RCB క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ మ్యాక్స్ వెల్ గాయంపై క్లారిటీ ఇచ్చాడు. మాక్సీకి రెండు స్కాన్‌లు జరిగాయి. అతను ప్రస్తుతం బాగానే ఉన్నాడు. గాయం గురించి మాకు ఎలాంటి ఆందోళన లేదు. అతను ఈ రోజు ప్రాక్టీస్ చేయబోతున్నాడు. అని బోబాట్ తెలిపాడు. దీంతో ఈ మ్యాచ్ లో ఈ ఆసీస్ స్టార్ ఆడటం దాదాపుగా ఖాయమైంది. ఒకవేళ మ్యాక్స్ వెల్ ఈ మ్యాచ్ కు అందుబాటులో లేకపోతే అతని స్థానంలో గ్రీన్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకుంటాడు.
also read : MI vs CSK: ఓటమి బాధ.. షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్లిపోయిన రోహిత్
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ మ్యాక్స్ వెల్ కు అసలు కలిసి రావడం లేదు. బ్యాటింగ్ ఇలా వచ్చి అలా వెళ్తున్నాడు. పట్టుమని పది బంతులు ఆడకుండా కనీసం రెండంకెల స్కోర్ చేయకుండానే పెవిలియన్ కు చేరుతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ విధ్వంసకర వీరుడు..దారుణంగా విఫలమవుతున్నాడు. 6 ఇన్నింగ్స్ ల్లో మొత్తం 32 పరుగులు చేసి ఘోరంగా విఫలమయ్యాడు. మరి నేడు జరగబోయే కీలక మ్యాచ్ లోనైనా మ్యాక్స్ వెల్ ఫామ్ అందుకుంటాడో లేదో చూడాలి.
Glenn Maxwell injury update: Will RCB star play in crucial clash against SRH? Check latest updatehttps://t.co/eMFPMyqrP7#ipl #ipl2024 #ipl2024updates #GlennMaxwell #rcb #RCBvsSRH#TATAIPL pic.twitter.com/FE6HIBUPAu
— News Boxer (@NewsBoxerDotCom) April 15, 2024