GT vs PBKS: ఆసీస్ స్టార్‌పై విమర్శలు: అయ్యర్ రూపంలో మ్యాక్ వెల్‌కు బ్యాడ్‌లక్

GT vs PBKS: ఆసీస్ స్టార్‌పై విమర్శలు: అయ్యర్ రూపంలో మ్యాక్ వెల్‌కు బ్యాడ్‌లక్

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ పై ప్రస్తుతం విమర్శల వర్షం కురుస్తుంది. ఐపీఎల్ కు పనికిరాడంటూ నెటిజన్స్ ఈ ఆసీస్ స్టార్ పై మండిపడుతున్నారు. మంగళవారం (మార్చి 25) గుజరాత్ టైటాన్స్ పై తొలి బంతికే ఔట్ కావడమే ఇందుకు కారణం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున గత సీజన్ లో ఘోరంగా విఫలమైన మ్యాక్స్ వెల్ ఈ సీజన్ లోనూ అదే పేలవ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. అయితే మ్యాక్స్ వెల్ ఔట్ కు పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా ఒక కారణమని తెలుస్తుంది. 

సాయి కిషోర్ వేసిన ఇన్నింగ్స్ 11 ఓవర్ నాలుగో బంతిని మ్యాక్స్ వెల్ రివర్స్ స్వీప్ ఆడాడు. గుజరాత్ అప్పీల్ చేయడంతో అంపైర్ ఔటిచ్చాడు. ఈ దశలో మ్యాక్ వెల్ రివ్యూ తీసుకోవడానికి అయ్యర్ సలహా అడిగాడు. అయితే అయ్యర్ మాత్రం రివ్యూ తీసుకో అని చెప్పలేదు. ఔట్ అన్నట్టుగా సైగ చేశాడు. దీంతో ఈ ఆసీస్ స్టార్ పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత రీప్లేలో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టు చూపించింది. మ్యాక్ వెల్ రివ్యూ తీసుకొని ఉంటే నాటౌట్ అయ్యేవాడు. కానీ అయ్యర్ సలహాతో ఔట్ అవ్వాల్సి వచ్చింది. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున గత సీజన్ లో ఒక్క మెరుపు ఇన్నింగ్స్ కూడా లేకపోగా ప్రతి ఇన్నింగ్స్ లో ఘోరంగా విఫలమయ్యాడు. అయితే 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో పంజాబ్ అతన్ని నమ్మి రూ. 4.2 కోట్లకు తీసుకుంటే తొలి మ్యాచ్ లోనే డకౌటయ్యాడు. ఆడిన తొలి బంతికే సాయి కిషోర్ ఫ్యాన్స్ రివర్స్ స్వీప్ ఆడి ఎల్బీడబ్ల్యూ రూపంలో వికెట్ సమర్పించుకున్నాడు. మ్యాక్స్ వెల్ ఇదే ప్రదర్శన కొనసాగితే అతను తుది జట్టులో చోటు సంపాదించుకోవడం కూడా కష్టంగా కనిపిస్తుంది. ఐపీఎల్ 2024 సీజన్ లో బెంగళూరు తరపున అట్టర్ ఫ్లాప్ షో చేశాడు. మొత్తం 9 ఇన్నింగ్స్ ల్లో 52 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రేయస్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌తో సత్తా చాటడంతో మెగా లీగ్‌‌‌‌‌‌‌‌ను పంజాబ్ కింగ్స్‌‌‌‌‌‌‌‌ అదిరిపోయే విజయంతో ఆరంభించింది. మంగళవారం జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 11  రన్స్ తేడాతో గుజరాత్ టైటాన్స్‌‌‌‌‌‌‌‌ను ఓడించింది. తొలుత  శ్రేయస్ మెరుపులతో పంజాబ్ 20 ఓవర్లలో 243/5 స్కోరు చేసింది. శ్రేయస్ అయ్యర్ (42 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో 97 నాటౌట్‌‌‌‌‌‌‌‌) తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనే హిట్టయ్యాడు. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో సాయి సుదర్శన్ (41 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 74), జోస్ బట్లర్ (33 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 54) ఫిఫ్టీలతో రాణించినా జీటీ 20 ఓవర్లలో 232/5  స్కోరు చేసి పోరాడి ఓడింది.