Glenn Maxwell: దేశానికే మ్యాక్ వెల్.. ఐపీఎల్‌కు కాదు: తొలి బంతికే రివర్స్ స్వీప్ ఏంటి బాస్

Glenn Maxwell: దేశానికే మ్యాక్ వెల్.. ఐపీఎల్‌కు కాదు: తొలి బంతికే రివర్స్ స్వీప్ ఏంటి బాస్

ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ ఐపీఎల్ లో తన పేలవ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున గత సీజన్ లో ఒక్క మెరుపు ఇన్నింగ్స్ కూడా లేకపోగా ప్రతి ఇన్నింగ్స్ లో ఘోరంగా విఫలమయ్యాడు. అయితే 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో పంజాబ్ అతన్ని నమ్మి రూ. 4.2 కోట్లకు తీసుకుంటే తొలి మ్యాచ్ లోనే డకౌటయ్యాడు. ఆడిన తొలి బంతికే సాయి కిషోర్ ఫ్యాన్స్ రివర్స్ స్వీప్ ఆడి ఎల్బీడబ్ల్యూ రూపంలో వికెట్ సమర్పించుకున్నాడు.

ఒక మంచి బంతికి డకౌట్ కావడం సహజం. కానీ మ్యాక్స్ వెల్ మాత్రం నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకుంటున్నాడు. ఇదే అభిమానులను నచ్చడం లేదు. మొన్నటివరకు బెంగళూరు ఫ్యాన్స్ ను నిరాశపర్చిన మ్యాక్సీ ఇప్పుడు పంజాబ్ ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తున్నాడు. క్రీజ్ లో కుదురుకునేందుకు కొంత సమయం తీసుకోకుండా బాధ్యత లేకుండా ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా తరపున అత్యుత్తమ ప్రదర్శన అందించే మ్యాక్స్ వెల్.. ఐపీఎల్ ఆంటే చేతులెత్తేస్తున్నాడు. ఈ ఆసీస్ స్టార్ ఆటను అభిమానులు సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్  చేస్తున్నారు.

ALSO READ | Shreyas Iyer: అయ్యరే వద్దన్నాడు: జట్టు కోసం సెంచరీ త్యాగం చేసిన శ్రేయాస్

మ్యాక్స్ వెల్ ఇదే ప్రదర్శన కొనసాగితే అతను తుది జట్టులో చోటు సంపాదించుకోవడం కూడా కష్టంగా కనిపిస్తుంది. ఐపీఎల్ 2024 సీజన్ లో బెంగళూరు తరపున అట్టర్ ఫ్లాప్ షో చేశాడు. మొత్తం 9 ఇన్నింగ్స్ ల్లో 52 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. వీటిలో నాలుగు డకౌట్స్ ఉన్నాయి. స్టార్ ప్లేయర్ అని వరుస అవకాశాలు ఇస్తుంటే ఒక్క మ్యాచ్ లో కూడా ప్రభావం చూపించలేకపోయాడు. బ్యాటింగ్ ఇలా వచ్చి అలా వెళ్ళాడు. పట్టుమని పది బంతులు ఆడకుండా కనీసం రెండంకెల స్కోర్ చేయకుండానే పెవిలియన్ కు చేరుతున్నాడు. రూ. 11 కోట్ల భారీ ధరకు దక్కించుకున్న ఆర్సీబీ నిరాశ తప్పలేదు.