PBKS vs CSK: క్రమశిక్షణ తప్పిన మ్యాక్స్ వెల్.. బీసీసీఐ బిగ్ పనిష్మెంట్

PBKS vs CSK: క్రమశిక్షణ తప్పిన మ్యాక్స్ వెల్.. బీసీసీఐ బిగ్ పనిష్మెంట్

పంజాబ్ కింగ్స్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ కు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది.  క్రమశిక్షణ తప్పినందుకు ఈ ఆసీస్ ఆల్ రౌండర్ ను మందలించింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో మ్యాక్స్ వెల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం లెవల్ 1 నేరానికి పాల్పడినట్టు తేలింది. దీంతో మ్యాక్స్ వెల్ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను ఇవ్వడం జరిగింది. మ్యాచ్ సమయంలో క్రికెట్ పరికరాలు, దుస్తులు, గ్రౌండ్ పరికరాలు దుర్వినియోగం చేస్తే ఈ శిక్ష విధిస్తారు. 

మ్యాక్స్ వెల్ ఏం చేసాడో ఖచ్చితమైన కారణం తెలియాల్సి ఉంది. అతను బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న కొన్ని సందర్భాల్లో బంతిని ఆపలేకపోయాడు. ఈ కారణంగా అతను క్రికెట్ కు సంబంధించిన ఏదో వస్తువులను దుర్వినియోగం చేసినట్టు సమాచారం. ఈ మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ మరోసారి బ్యాటింగ్ లో విఫలమయ్యాడు. కేవలం ఒక పరుగు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్ లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే బౌలింగ్ లో మాత్రం ఆకట్టుకున్నాడు. రెండు ఓవర్లలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన రచీన్ రవీంద్ర వికెట్ పడగొట్టాడు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో పంజాబ్‌‌‌‌‌‌‌‌ 18  రన్స్ తేడాతో సీఎస్కేను ఓడించి మూడో విజయం అందుకుంది. తొలుత పంజాబ్ 20 ఓవర్లలో 219/6 స్కోరు చేసింది. ఆర్యకు తోడు శశాంక్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ (36 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 నాటౌట్‌‌‌‌‌‌‌‌), మార్కో యాన్సెన్ (19 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 నాటౌట్‌‌‌‌‌‌‌‌) దంచికొట్టారు. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో సీఎస్కే 20 ఓవర్లలో  201/5  చేసి ఓడింది. డెవాన్ కాన్వే (49 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 69), శివం దూబే (27 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 42)తో పాటు చివర్లో ఎంఎస్ ధోనీ (12 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 3 సిక్సర్లతో 27) మెరిసినా చెన్నైకి నాలుగో ఓటమి తప్పలేదు.