IPL 2024: మా బౌలర్లపై ఒక్క శాతం కూడా ఆ ప్రభావం ఉండదు: 20 కోట్ల వీరులపై ఆసీస్ దిగ్గజం

IPL 2024: మా బౌలర్లపై ఒక్క శాతం కూడా ఆ ప్రభావం ఉండదు: 20 కోట్ల వీరులపై ఆసీస్ దిగ్గజం

స్టార్ ఆటగాళ్లపై విపరీతమైన అంచనాలు ఉండడం సహజమే. ఏ అంచనాలు నిలబెట్టుకునే క్రమంలో వీరిపై చాలా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యంగా ఐపీఎల్ లాంటి మెగా లీగ్స్ లో హీరోలవుతారనుకున్న ఆటగాళ్లు జీరోలవుతారు. ఫ్రాంచైజీలు కొంతమంది స్టార్ ఆటగాళ్లకు కోట్లు కుమ్మరించి భారీ ధరను వెచ్చించినా..తీవ్రంగా నిరాశ పరుస్తారు. ఈ లిస్టులో ఇప్పటివరకు చాలా మంది ఆటగాళ్లే ఉన్నారు. ప్రతి ఏడాది నమ్మక ముంచి కోట్లు కుమ్మరించిన ప్లేయర్లు విఫలమవడం మనం ప్రతి సీజన్ లో చూస్తూనే ఉంటాం.
 
మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ లో అందరి దృష్టి ఆసీస్ ప్లేయర్స్ ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్ పైనే ఉంది. వేలంలో వీరికి రూ. 20 కోట్లకు పైగా మన ఐపీఎల్ ఫ్రాంచైజీలు చెల్లించారు. ఐపీఎల్ చరిత్రలో కొత్త రికార్డులు సృష్టించారు. ఆసీస్ లెఫ్టార్మ్ పేస‌ర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ఆటగాడిగా నిలిచాడు. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్(కేకేఆర్) యాజమాన్యం రూ.24.75 కోట్లు వెచ్చించి అతన్ని చేజిక్కించుకుంది.

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్, కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఐపీఎల్ 2023 మినీ వేలంలో రికార్డ్ ధరకు అమ్ముడయ్యాడు. కనీస ధర రూ. 2 కోట్లతో ఈ ఆసీస్ కెప్టెన్ వేలం ప్రారంభం కాగా..సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.20.50 కోట్లు వెచ్చించి అతన్ని దక్కించుకుంది. దీంతో వీరిద్దరికి ఇంత భారీ మొత్తంలో చెల్లించడంతో వీరు ఈ ధరకు న్యాయం చేయలేరనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే అలాంటి భయాలేమీ పెట్టుకోవద్దు అంటున్నాడు ఆసీస్ దిగ్గజ బౌలర్ గ్లెన్ మెగ్రాత్ అన్నాడు.

Also Read :నన్ను అలా పిలవొద్దు..నాకు ఇబ్బందిగా ఉంటుంది

"కమ్మిన్స్, స్టార్క్ కు ఇంత భారీ ధర పలకడం నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఇద్దరూ కూడా చాలా అనుభవజ్ఞులు. వారికి ఆట ఎలా ఆడాలో బాగా తెలుసు. గతంలో ఎంత బాగా ఆడారో ఐపీఎల్ లో కూడా అదే ప్రదర్శనతో ఆకట్టుకుంటారు. భారీ ధర వారిపై ఒక్క శాతం కూడా ప్రభావం చూపించదు. తనదైన రోజున వారిద్దరిని ఎవరూ ఆపలేరు". అని మెగ్రాత్ అన్నాడు. కమ్మిన్స్ సన్ రైజర్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. స్టార్క్ కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నాడు.