ఆరేళ్ళ క్రితం ఐపీఎల్ ఫైనల్ కు చేరిన సన్ రైజర్స్ తుది సమరంలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. 2018 లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తుగా ఓడింది. అయితే మరోసారి ఫైనల్ కు చేరడంతో హైదరాబాద్ ఎలాగైనా టైటిల్ గెలవాలని గట్టి పట్టుదలతో ఉంది. ఆదివారం (మే 26) కోల్‌కతా నైట్ రైడర్స్ తో ఫైనల్ ఫైట్ కు సిద్ధమైంది. ఈ లీగ్ లో కేకేఆర్ ఏపియా ఆడిన రెండు మ్యాచ్ ల్లో సన్ రైజర్స్ ఓడిపోయింది. దీంతో లీగ్ లో ఎదురైన రెండు ఓటములకు తుదిపోరులోనే ప్రతీకారం తీర్చుకోవాలని హైదరాబాద్ కసిగా ఉంది.
శుక్రవారం ఇదే వేదికపై జరిగిన క్వాలిఫయర్2లో రాజస్తాన్ ను చిత్తు చేసిన ఉత్సాహంలో ఉన్న రైజర్స్ అదే రిజల్ట్‌ను రిపీట్ చేసి ఎనిమిదేండ్ల తర్వాత రెండోసారి ఐపీఎల్ బాద్‌షా అవ్వాలని హైదరాబాద్ కోరుకుంటోంది. చివరిసారిగా 2016 లో టైటిల్ గెలిచిన సన్ రైజర్స్ 8 ఏళ్ళ తర్వాత ఆ మరోసారి టైటిల్ గెలిచి మ్యాజిక్ చేయాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో తుది జట్టు విషయంలో చిన్న గందరగోళం నెలకొంది.
గ్లెన్ ఫిలిప్స్ కు ఛాన్స్ ఇస్తారా..?
విదేశీ ప్లేయర్ల కోటాలో ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసన్ అదరగొడుతుంటే.. కమ్మిన్స్ తన కెప్టెన్సీతో ఆకట్టుకుంటున్నాడు. అయితే జట్టులో మరో విదేశీ ఆటగాడు మార్కరం మాత్రం ప్రభావం చూపించలేకపోతున్నాడు. ఒక్క హాఫ్ సెంచరీ మినహాయిస్తే మిగిలిన మ్యాచ్ ల్లో విఫలమయ్యాడు. కీలకమైన క్వాలిఫయర్ 2 లోనూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. ఇతని స్థానంలో వచ్చిన శ్రీలంక స్పిన్నర్ విజయకాంత్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
దీంతో నేడు మార్కరం స్థానంలో న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ కు అవకాశం రావొచ్చు. ఫిలిప్స్ అంతర్జాతీయ క్రికెట్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. గతేడాది సన్ రైజర్స్ తరపున మెరుపులు మెరిపించాడు. ఈ కారణంగానే విశ్రాంతి పేరుతో మార్కరంను పక్కన పెట్టొచ్చు. అయితే ఫైనల్ కు ముందు కమ్మిన్స్ ఈ ప్రయోగం చేస్తాడా అంటే చెప్పలేం. ఎందుకంటే ఇప్పటివరకు ఫిలిప్స్ కు అవకాశం ఇవ్వడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఫైనల్ కు ముందు ఇలాంటి ప్రయోగాలు చేసి బెడిసికొడితే విమర్శలు తప్పవు. దీంతో గెలిచిన జట్టుతోనే సన్ రైజర్స్ బరిలోకి దిగే అవకాశం ఉంది.
Should Glenn Phillips replace Aiden Markram in the playing XI for SRH in the final against KKR?#GlennPhillips #AidenMarkram #KKRvSRH #KKRvsSRH #IPL #IPL2024 #Cricket #SBM pic.twitter.com/jgZ2Pd3H3M
— SBM Cricket (@Sbettingmarkets) May 26, 2024