
ఐపీఎల్ లో అన్ లక్కీ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ అనే చెప్పాలి. వరల్డ్ క్లాస్ బ్యాటర్ గా పేరున్నా.. టాప్ ఫినిషర్ గా గుర్తింపు ఉన్నా ఈ కివీస్ ఆల్ రౌండర్ కి గత రెండు సీజన్ లుగా ఐపీఎల్ ఆడే ఛాన్స్ రావడం లేదు. గత సీజన్ లో సన్ రైజర్స్ తరపున ఒక్క మ్యాచ్ లో ఆడే అవకాశం రాకపోగా.. ప్రస్తుత సీజన్ లో గుజరాత్ టైటాన్స్ పై బెంచ్ కే పరిమితమయ్యాడు. అతని దురదృష్టానికి తోడు గాయం కారణంగా ఐపీఎల్ 2025 మొత్తానికి దూరమయ్యాడు. ఫిలిప్స్ గాయపడడంతో గుజరాత్ టైటాన్స్ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
గజ్జల్లో గాయం కారణంగా మిగిలిన ఫిలిప్స్ స్వదేశానికి వెళ్లనున్నట్టు సమాచారం. ఫిలిప్స్ పై త్వరలోనే అధికార ప్రకటన రానుంది. ఏప్రిల్ 6న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ జరుగుతున్నా సమయంలో ఫిలిప్స్ గాయపడ్డాడు. ఈ మ్యాచ్ లో గుజరాత్ తరపున ఫీల్డింగ్ వచ్చిన అతనికి గజ్జల్లో గాయమైంది. దీంతో మైదానం వదిలి వెళ్ళిపోయాడు. ఫిలిప్స్ స్థానంలో గుజరాత్ టైటాన్స్ ఇంకా ఎవరినీ ప్రకటించలేదు. "ఏప్రిల్ 6న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరిగిన మ్యాచ్‌లో గజ్జలో గాయం కారణంగా గ్లెన్ ఫిలిప్స్ న్యూజిలాండ్‌కు తిరిగి వచ్చాడు. గ్లెన్ త్వరగా కోలుకోవాలని గుజరాత్ టైటాన్స్ కోరుకుంటుంది". అని గుజరాత్ టైటాన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ జట్టులో ఐదుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. జోస్ బట్లర్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రషీద్ ఖాన్, జెరాల్డ్ కోట్జీ, కరీం జనత్. ఐపీఎల్ ప్రతి జట్టుకు ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్లను కలిగి ఉండటానికి అనుమతి ఇచ్చింది. దీంతో టైటాన్స్ తమ జట్టులో మరో ముగ్గురు ఫారెన్ ప్లేయర్స్ ను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వ్యక్తిగత కారణాల వలన సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ రబడా స్వదేశానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ దూసుకెళ్తుంది. ఆడిన 5 మ్యాచ్ ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో కొనసాగుతుంది.
గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2025 జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, జోస్ బట్లర్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ప్రసిధ్ కృష్ణ, ఇషాంత్ లో అర్వా ఖాన్, జయపాల్ శర్మ, అనుజ్ పాల్ శర్మ, అనూజ్ యాదవ్
Glenn Phillips has returned to New Zealand and set to miss the remainder of IPL 2025 due to a groin injury pic.twitter.com/BmZ1ET8Okz
— CrickAnsh (@Crickanshh) April 12, 2025